సింపుల్‌గా అందంగా.. మెగా బ్యూటీ ఫొటోస్

Samatha

3 August 2026

మెగా డాటర్ నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అంద చందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, ఢీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన యాంకరింగ్‌తో అందరి మనసు ఆకట్టుకుంది.

అంతే కాకుండా తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  ఒక  మనసు సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది తర్వాత  సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించింది.

కానీ హీరోయిన్‌గా తనకు అంతగా కలిసి  రాకపోవడంతో, మూవీస్‌కు గుడ్ బై చెప్పింది. పెళ్లి పీటలు ఎక్కింది. సిద్ధు జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ వివాహం జరిగిన కొద్దిరోజుల్లోనే వీరు మనస్పర్థలతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు. దీని తర్వాత ఇద్దరూ వారి వారి కెరీర్ పై ఫోకస్ పెట్టారు.

ముఖ్యంగా నిహారిక నిర్మాతగా మారి, సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, దాని ద్వారా పలు సినిమాలు తెరకెక్కిస్తూ, సక్సెస్ కొనసాగిస్తుంది.

ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సింపుల్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి