AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!

వ్యాపారం అంటూ వచ్చారు.. అందరితో మంచిగా మెలిగారు. పరిచయం పెంచుకున్నారు. నమ్మకాన్ని కూడగట్టారు. ఆ తర్వాతే ఆసలు పథకాన్ని అమలు చేశారు. అధిక లాభాలు ఇస్తామని.. చిట్టీల పేరుతో జనాల నుంచి కోట్లాది రూపాయలు కాజేశారు. డబ్బులు చేతికందగానే.. చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే చెక్కేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.

Telangana: చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!
Telangana Chit Fund Scam
P Shivteja
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 5:25 PM

Share

చిట్టీల పేరుతో అమాయక జనాలను భార్య భర్తలు ఏకండా కోట్ల రుపాయలు కాజేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన భార్య భర్తలు గత 20 ఏళ్లుగా అమీన్ పూర్ మండలం బీరంగూడలోని BSR కాలనిలో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా స్థానికంగా సాయి గణేష్ టెక్స్‌టైల్స్ పేరుతో బట్టల వ్యాపారం నిర్వహిస్తూ కాలనీవాసులతో మంచి పరిచయాలు పెంచుకున్నారు.

షాపు వద్దకు వచ్చే మహిళలతో శిరీష ఓ బిజినెస్ ఐడియా చెప్పింది. కాలనిలో ఉన్న మహిళలంతా కలిసి చిట్టీలు వేద్దామని ఎవరికి వస్తే వారు తీసుకుందామని నమ్మించింది. కష్టం చేసిన డబ్బులు వృధా ఖర్చులు కాకుండా ఉంటాయని చెప్పడంతో మహిళలు అట్రాక్ట్ అయ్యారు. అలా కొన్నేళ్లుగా కాలనిలో ఉంటున్న సుమారు 50 మంది మహిళలు కలిసి చిట్టీలు వేశారు. అయితే చిట్టి ఎవరికి వచ్చిన ఆ మహిళలను మాయమాటలు చెప్పేది శిరీష.

చిట్టి డబ్బులు నాకే ఇస్తే వచ్చిన డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని శిరీష తోటి మహిళల్ని నమ్మించింది. దింతో చిట్టి డబ్బులు రాగానే శిరిషకే ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా సుమారు 50 మంది మహిళల నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది శిరీష. కొన్ని రోజులపాటు తీసుకున్న డబ్బులకు వడ్డీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడగ్గా ఈ రోజు రేపు అంటూ దాటవేస్తూ వచ్చింది. దింతో బాధిత మహిళలు శిరిషని గట్టిగా నిలదీశారు. మా కష్టార్జితాన్ని నమ్మి నీ చేతిలో పెట్టామని. వెంటనే తమ డబ్బులు తమకివ్వాలని చెప్పడంతో కొందరికి ఫలానా తేదీ రోజు ఇస్తామని శిరీష దంపతులు ఖాళీ చెక్కులు ఇచ్చారు.

ఆ తర్వాత కొద్దీ రోజులకు బట్టల షాపుని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. విషయం తెలియడంతో మరోసారి శిరీష దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. తమ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని అందుకే డబ్బులు ఖర్చు అయ్యాయని స్థానికులతో చెప్పారు శిరిష దంపతులు. ఇల్లు అమ్మైనా సరే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాను అని చెప్పారు. నిజమే అనుకోని వారు కూడా శాంతించారు. అంతలోనే వారిలోని దుర్బుద్ధి బయటపడింది.

రాత్రికి రాత్రే ఇల్లు అమ్మేశారు. కట్టుబట్టలతో పరార్ అయ్యారు శిరీష దపంతులు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ.. చేసేదేమిలేక అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో శిరీష, సాంబశివరావుపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిలాడి దంపతులపై తక్షణమే చర్యలు తీసుకుని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే
చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే
బతికింది 14 ఏళ్లే.. కానీ, 1000 ఏళ్లైనా చెరిగిపోని చరిత్ర దీనిది!
బతికింది 14 ఏళ్లే.. కానీ, 1000 ఏళ్లైనా చెరిగిపోని చరిత్ర దీనిది!
సూపర్ మార్కెట్లొ చేసే ఈ తప్పులే మీ వెయిట్ లాస్‌ జర్నీకి బ్రేకులు!
సూపర్ మార్కెట్లొ చేసే ఈ తప్పులే మీ వెయిట్ లాస్‌ జర్నీకి బ్రేకులు!
కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు! అంతర్జాతీయ దొంగల ముఠా..
కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు! అంతర్జాతీయ దొంగల ముఠా..
బాంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం..
బాంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం..
లవర్‌తో స్పైడర్ మ్యాన్ సినిమాకు వచ్చాడు.. కట్ చేస్తే
లవర్‌తో స్పైడర్ మ్యాన్ సినిమాకు వచ్చాడు.. కట్ చేస్తే
Astrology: సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..
Astrology: సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..
ఒక్క కాల్‌తో ఇంటికే గ్యాస్ సిలిండర్.. కేవలం రెండు గంటల్లోనే..
ఒక్క కాల్‌తో ఇంటికే గ్యాస్ సిలిండర్.. కేవలం రెండు గంటల్లోనే..
నన్ను పెళ్లాడితే జన్మ సార్ధకం.. దొంగ బాబా లీలలు! చితకబాదిన జనాలు
నన్ను పెళ్లాడితే జన్మ సార్ధకం.. దొంగ బాబా లీలలు! చితకబాదిన జనాలు
పూజకు ముందు ఆచమనం ఎందుకు చేస్తారు? ఆధ్యాత్మిక రహస్యం ఇదే
పూజకు ముందు ఆచమనం ఎందుకు చేస్తారు? ఆధ్యాత్మిక రహస్యం ఇదే