AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవర్‌తో స్పైడర్ మ్యాన్ సినిమాకు వచ్చాడు.. ఆడియన్స్‌తో తన్నులు తిన్నాడు..! ఏం జరిగిందో తెలిస్తే మీరు తప్పులేదు అంటారు

ప్రపంచం మొత్తం ఆసక్తిగా వేచి చూస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూశారు. ఇక సినిమా ప్రేక్షకులు ఊహించిన దానికంటే 10 రేట్లు ఎక్కువ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

లవర్‌తో స్పైడర్ మ్యాన్ సినిమాకు వచ్చాడు.. ఆడియన్స్‌తో తన్నులు తిన్నాడు..! ఏం జరిగిందో తెలిస్తే మీరు తప్పులేదు అంటారు
Spiderman Brand New Day
Rajeev Rayala
|

Updated on: Aug 03, 2026 | 5:09 PM

Share

హాలీవుడ్ సినిమాలకు మన తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన స్పైడర్ మ్యాన్ హవ కనిపిస్తుంది.  ఇటీవలే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే డే సినిమా విడుదలైంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. హాలీవుడ్ తో పాటు మన దగ్గర కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బ్రాండ్ న్యూ డే. రోజు రోజుకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. టామ్ హలండ్ స్పైడర్ మ్యాన్ గా, జెండయా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాడి సింక్, జాకబ్ బ్యాటలాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా స్పైడర్ మ్యాన్ సినిమా ఆడుతున్న థియేటర్ లో పెద్ద గొడవ జరిగింది. థియేటర్ లో ఓ వ్యక్తిని అక్కడున్న ప్రేక్షకులు చితకబాదారు. ఎందుకో తెలిస్తే మీరు కూడా తప్పులేదు అంటారు. ఇంతకూ ఆ వ్యక్తి థియేటర్ లో ఏం చేశాడు.? ఆడియన్స్ కు ఎందుకు కోపం వచ్చింది.

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

అసలు మ్యాటర్ ఏంటంటే.. స్పైడర్ మ్యాన్ సినిమాలో ఉండే విజువల్స్, ట్విస్ట్ లు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ఆ ఎగ్జైమెంట్ ను చెడగొడితే ఊరుకుంటారా.? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ వ్యక్తి తన ప్రేయసిని తీసుకొని స్పైడర్ మ్యాన్ సినిమాకు వెళ్ళాడు.. హాలు ప్రేక్షకులతో నిండిపోయింది. సినిమా మంచి రసవత్తరంగా ఉండగా ఆ వ్యక్తి తన లవర్ తో మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగలేదు.. సినిమాలో నెక్ట్స్ వచ్చే సీన్స్ ను ముందుగానే చెప్పడం మొదలు పెట్టాడు.

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

చుట్టూ ఉన్న ఆడియన్స్ వీడెవడ్రా బాబు అని అనుకున్నా అతను ఆగలేదు. అదే పనిగా ఆమెకు సినిమా మొత్తం ముందే చెప్పుకుంటూ వస్తున్నాడు. దాంతో పక్కన ఉన్న ఫ్యాన్స్ కు కాలింది.. ఇంత డబ్బులు పెట్టుకొని తమ అభిమాన సూపర్ హీరో సినిమాకు వస్తే వీడు స్పాయిల్ చేస్తున్నాడని అందరూ కలిసి అతన్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. కొట్టడంలో తప్పే లేదు అని కొందరు అంటుంటే.. ఇలాంటి ఎదవలు మాకు కూడా తగిలారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రేయసితో వచ్చి తన్నులు తిన్నాడు సదరు వ్యక్తి.

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

View this post on Instagram

A post shared by Agam (@agammm_16)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us