మా అందాలు కాదు నటనను చూసి మెచ్చుకోవాలి.. హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
03 August 2026
గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది దిశా పటానీ.
తెలుగు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుని దూసుకుపోతుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిశా పటానీ మాట్లాడుతూ.. తన సినిమాలు, కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే గ్లామర్ గురించి చెప్పుకొచ్చింది.
త్వరలోనే హోలిగార్డ్స్ సాగా ది పోర్డల్ ఆఫ్ ఫోర్స్ అనే హాలీవుడ్ సినిమాలో జెస్సికా ఆనే కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమా గురించి మాట్లాడింది దిశా.
గ్లామర్ అనేది నా వృత్తిలో ఒక భాగం మాత్రమే. కానీ ఒక నటిగా తన నటనతోనే ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవాలని అనుకుంటాను అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులతో పనిచేయడం, పూర్తిగా భిన్నమైన సెటప్ లో చిత్రీకరణ జరుపుకోవడం సరికొత్తగా ఉందని..
ఈ హాలీవుడ్ సినీ ప్రయాణం తనను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చిందని.. భవిష్యత్తులో కూడా తనలోని రకరకాల భావోద్వేగాలను...
నటనలోని కొత్త కోణాలను బయటకు తీసే విలక్షణ పాత్రలనే ఎంచుకోవడానికి పెద్ద ప్రేరణగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం దిశా కామెంట్స్ వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్