Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికీ అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. ఆగస్ట్ 5 వరకే ఛాన్స్..
ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి అకౌంట్లో ప్రతీ ఏడాది రూ.25 వేలు జమ కానున్నాయి. ఈ మేరకు దరఖాస్తు చేసుకునేందకు ఆగస్ట్ 15 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక కొత్త పథకాలు ప్రారంభించగా.. మరో నూతన స్కీమ్ ప్రారంభించేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు పథకం ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఆగస్ట్ 7వ తేదీన నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఆగస్ట్ 5తో ముగియనుంది. దీంతో అప్పటిలోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఆగస్ట్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నెల 7వ తేదీన నేతన్న సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆ రోజున చేనేత జాతీయ దినోత్సవం సందర్బంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ప్రతీ చేనేత కుటుంబానికి రూ.25 వేలు అందించనున్నారు. వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు. ఇక నుంచి ప్రతీ ఏడాది నేతన్న సేవలో పథకం ద్వారా చేనేతల కుటుంబానికి రూ.25 వేల ఆర్దిక సాయం అందించనున్నారు. అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. దీని వల్ల అకౌంట్లలో వెంటనే డబ్బులు పొందవచ్చు. అర్హులైన ప్రతీఒక్కరి ఈ పధకం వర్తింపచేస్తామని ప్రభుత్వం తెలిపింది. మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేయనుంది. నెల రోజుల తర్వాత లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఇప్పటివరకు 51,952 మంది ఈ పధకం కింద అర్హత పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది.
అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేసేలా చేనేత, జౌళిశాఖ అధికారులు కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చేనేత మగ్గం కలిగిన ప్రతీ కుటుంబానికి రూ.25 వేలు అందించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇటీవల ప్రభుత్వం చేనేతల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం లబ్దిదారులకు నేతన్న సేవలో పథకాన్ని వర్తింపచేయనుంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించనున్నారు. సచివాలయ సిబ్బంది అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. అర్హుల జాబితాను సచివాలయల్లో ప్రదర్శించనున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, చేనేత కార్మికుల గుర్తింపు కార్డు, పాస్ బుక్, రెసిడెన్స్ ప్రూఫ్, పాస్ పోర్టు సైజు ఫోటోలతో సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
