విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి తన శరీరంలో ఈ ముఖ్యమైన పోషకం (విటమిన్ డీ).. లోపం ఉందని సులభంగా గ్రహించలేకపోవచ్చు.. కానీ కొన్ని లక్షణాలను గమనించిన తర్వాత అంచనా వేయవచ్చు. ఈ పోషకాలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాల్షియం శోషణలో సహాయం చేయడం, ఎముకలను బలంగా ఉంచడం, జన్యువులు, కణాల పెరుగుదలను నియంత్రించడం, రికెట్స్, బోలు ఎముకల వ్యాధిని నివారించడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం అలాగే బలంగా మార్చడం వంటి వాటిలో విటమిన్ డీ సహాయపడుతుంది. అయితే.. విటమిన్ డి లోపం ఉంటే శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. విటమిన్ డీ లోపం ఉంటే.. కండరాల నొప్పి, ఎముకల నొప్పి.. సున్నితత్వం పెరిగడం.. చేతులు లేదా కాళ్ళలో నొప్పితోపాటు అనే అలసట.. బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి..