Water for Weight Loss: తెలుసా.. నీళ్ల ద్వారా కూడా బరువు తగ్గొచ్చట? ఎలాపడితే అలాతాగితే అసలుకేఎసరు

చాలా మంది బరువు తగ్గడానికి నానాపాట్లు పడుతుంటారు. అయితే సింపుల్ గా నీళ్లు తాగితే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. రోజూ ఈ వేళల్లో నీళ్లు తాగితే ఎలాంటి శారీరక కసరత్తులు చేయకుండానే సులువుగా బరువుతగ్గొచ్చంటున్నారు నిపుణులు..

Srilakshmi C

|

Updated on: Dec 02, 2024 | 1:32 PM

నేట జీవనశైలి కారణంగా అధిక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎన్నో పాట్లు పడుతున్నారు. కొందరు జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేస్తే.. మరికొందరు ఇంట్లోనే బరువు తగ్గడానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలా ఇంట్లోనే సులువుగా బరువు తగ్గే మార్గాల్లో ఒకటి తాగునీరు. అవును.. చాలా మంది నీరు త్రాగడం వల్ల బరువు తగ్గుతారని, కొవ్వు కరిగిపోతుందని చాలా మంది నమ్ముతుంటారు. దీనిలో నిజమెంతో హార్వర్డ్ నిపుణులు మాటల్లో మీకోసం..

1 / 5
హార్వర్డ్ నివేదిక ప్రకారం.. నీరు తాగడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. దీని ప్రభావం కూడా చాలా త్వరగానే కనిపిస్తుంది. కానీ బరువు తగ్గాలంటే నీరు త్రాగే సమయాన్ని సరిగ్గా బ్యాలెన్స్‌ చేయాలి. భోజనం తినడానికి కనీసం అరగంట ముందు మాత్రమే నీరు త్రాగాలి. అలాగే రోజంతా చిన్న మొత్తంలో నీరు త్రాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి.

2 / 5
మీరు భోజనంలో 25 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే, శరీరం ఒకేసారి జీర్ణం చేయడానికి కష్టపడుతుంది. అలాకాకుండా ప్రోటీన్ తీసుకోవడం క్రమంగా పెంచడం ద్వారా, జీర్ణవ్యవస్థకు తగినంత సమయం లభిస్తుంది. ఇలా జరగాలంటే శరీరంలోకి తగినంత నీటిని తీసుకోవాలి.

3 / 5
దీనిపై పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే ఏం చెబుతున్నారంటే.. ఎక్కువ ప్రొటీన్‌లు తిన్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం. శరీరంలోకి ప్రోటీన్ ఫుడ్‌ తీసుకోవడం పెరిగితే, మీరు ఎక్కువగా నీరు త్రాగాలి? ఎందుకంటే..

4 / 5
బరువు తగ్గడానికి, శరీర కొవ్వును కరిగించడం అవసరం. శరీరానికి తగినంత నీటిని అందించడం ద్వారా, కొవ్వును వేగంగా కరిగించవచ్చు. నిజానికి ఒంట్లోకి నీరు వెళ్లిన తర్వాత శరీరంలోని కణాల్లోని కొవ్వును కరిగించి శక్తిగా మార్చడం వల్ల బరువు తగ్గడానికి వీలుంటుంది.

5 / 5
Follow us