- Telugu News Photo Gallery Cinema photos Actress hebah patel shared her latest glamorous photos goes viral
ఓయబ్బో.. హెబ్బా వయ్యారాలు మాములుగా లేవుగా.. కుర్రాళ్ళ గుండెలు భద్రం
అంతకు ముందు అలా ఎలా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక కుమారి 21 ఎఫ్ సినిమా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ను డబుల్ చేసింది. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి.
Updated on: Dec 02, 2024 | 2:00 PM

అందాల భామ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్.

అంతకు ముందు అలా ఎలా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక కుమారి 21 ఎఫ్ సినిమా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ను డబుల్ చేసింది. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి.

కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది కుర్రాళ్ళు హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు. అంతలా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి ఈ చిన్నదానికి. కానీ హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

రామ్ హీరోగా నటించిన రెడ్ అనే సినిమాలో స్సెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతో ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి.

సోషల్ మీడియాలో హెబ్బా చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ వయ్యారి భామ.