- Telugu News Photo Gallery Cinema photos Sobhita Dhulipala Haldi And Mangala Snanam Photos goes viral
Sobhita Dhulipala: పెళ్ళికలవచేసిందే బాల.. శోభిత ఇంట పెళ్లి పనులు.. మెరిసిపోతున్న ముద్దుగుమ్మ
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి ముందు జరిగిన హల్దీ వేడుకల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Updated on: Dec 02, 2024 | 2:06 PM

అక్కినేని వారి ఇంట పెళ్లిసందడి మొదలైంది. త్వరలోనే అక్కినేని యంగ్ హీరోలు. నాగ చైతన్య, అఖిల్ పెళ్లిపీటలు ఎక్కనున్న. ఇటీవలే నాగ చైతన్య, శోభిత ఎంగేజ్ మెంట్ జరిగింది. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు చైతన్య.

నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి ముందు జరిగిన హల్దీ వేడుకల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. శోభిత హల్దీ వేడుకలో ప్రజల దృష్టిని ఆఆకర్షిస్తున్నాయి. శోభితను హల్దీ వేడుకలో సమంత సందడి చేసింది అనే టైటిల్ తో కొన్ని ఫోటో వైరల్ అవుతున్నాయి. టైటిల్ చదివి అందరు నటిని సమంత అని పొరబడతారు కానీ అలా కాదు. శోభిత సోదరి పేరు సమంత.

నాగచైతన్య, శోభిత వివాహానికి అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేశారని తెలుస్తోంది. కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ ప్రేముఖులు కూడా ఈవివాహానికి హాజరు కానున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నా ఆవిషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు.

శోభిత తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించిది. అలాగే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక నాగచైతన్య నటించిన తండేల్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.




