Pushpa 2: ఇది భయ్యా పుష్పగాడి క్రేజ్ అంటే.. లండన్ వీధుల్లో బన్నీ ఫ్యాన్స్ అదరగొట్టారు..
మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా మేనియా కనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్స్ మరింత వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప2 క్రేజ్ మారుమోగుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మాస్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించిన చిత్రయూనిట్.. ఈరోజు హైదరాబాద్ లో భారీ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఈ వెంట్ నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. పుష్పరాజ్ క్రేజ్ కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కొనసాగుతుంది. ఇప్పటికే అమెరికాలోని ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప 2 చిత్రం. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లండన్ వీధిల్లో బన్నీకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కొందరు ఫ్యాన్స్ లండన్ వీధుల్లో పుష్ప సినిమాలోని పుష్ప పుష్పరాజ్ హిందీ పాటకు డాన్స్ అదరగొట్టారు. తమ అద్భుతమైన స్టెప్పులతో బన్నీపై బన్నీపై ప్రేమను బయటపెట్టారు.
ప్రస్తుతం బన్నీ డాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ రీషేర్ చేస్తూ.. ‘లండన్ వీధుల్లో ఇండియన్ బిగ్గెస్ట్ సినిమా పుష్ప 2.. పుష్ప పాటకు డాన్స్ చేస్తూ లండన్ వీధుల్లో ఫ్యాన్స్ తమ ప్రేమను చూపించారు’ అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.