Nora Fatehi: నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ అదే.. రోజూ కచ్చితంగా ఆ పనిచేస్తాను.. నోరా ఫతేహి..
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నోరా ఫతేహి ఒకరు. నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కోంది. తినడానికి తిండి లేకుండా.. అవకాశాల పేరుతో వచ్చే వేధింపులను సైతం భరించినట్లు ఇదివరకు చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. అలాగే తన గ్లోయింగ్ సీక్రెట్స్ సైతం రివీల్ చేసింది.

Nora Fatehi
- బీటౌన్ ఇండస్ట్రీలోని అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో నోరా ఫతేహి ఒకరు. ఆమె ప్రముఖ డ్యాన్సర్. కథానాయిక కంటే ఎక్కువగా స్పెషల్ పాటలతోనే ఫేమస్ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు తన అందం, కాంతివంతమైన చర్మం వెనుక ఉన్న సీక్రెట్స్ వెల్లడించింది.
- గతంలో ఆమె కపిల్ శర్మ షోలో పాల్గొని.. తన స్కిన్, ఫిట్నెస్ సీక్రెట్స్ బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో తన స్కిన్ అంత గ్లో కావడానికి ఏం తింటారు ? మీ రోటిన్ ఏంటీ ? అనే విషయాలు పంచుకుంది.
- తనకు మంచి రొటీన్ ఉందని.. పాస్తా అన్నం, పప్పు, రోటీ, ఊడికించిన బంగాళాదుంపలు మాత్రమే తీసుకుంటానని తెలిపింది. తనకు కారు లేదని ఆటో రిక్షాలోనే ప్రయాణిస్తాని అన్నారు. తన అద్భుతమైన డ్యా్న్స్ స్టెప్పులతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
- స్పెషల్ పాటలతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం డ్యాన్సర్ గానే కాకుండా బాట్లా హౌస్, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ, మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాలతో నటించి తనకంటూ మంచి స్థానం సంపాదించుకున్నారు.
- ఇప్పుడు ఈ అమ్మడు అటు సినిమాలతోపాటు ఇటు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్యూటీఫుల్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి





