AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శీతాకాలంలో లభించే చౌకైన పండు ఇదే.. డైలీ ఒకటి తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. వీటిని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.. ముఖ్యంగా.. శీతాకాలంలో లభించే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని.. వీటిని డైలీ తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. అలాంటి పండ్లలో జామకాయ ఒకటి.. శీతాకాలంలో జామ పండు తినడం మంచిది..

శీతాకాలంలో లభించే చౌకైన పండు ఇదే.. డైలీ ఒకటి తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
Health Benefits of Guava in Winter
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2025 | 5:31 PM

Share

పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. వీటిని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.. ముఖ్యంగా.. శీతాకాలంలో లభించే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అలాంటి పండ్లలో జామకాయ ఒకటి.. శీతాకాలంలో జామ పండు తినడం మంచిది.. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. జామ పండులో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం, 5 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఈ పండు సాధారణంగా ప్రతిచోటా లభిస్తుంది.. అన్ని సీజన్లలో జామపండ్లు లభిస్తున్నప్పటికీ.. శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి.. అంతేకాకుండా చౌకగా కూడా ఉంటాయి.. సాధారణంగా ఒక జామకాయ రూ.5 లేదా 10 కి లభిస్తుంది.. ఇంకా కేజీ రూ.50 వరకు లభిస్తాయి.. అయితే.. నాణ్యతను బట్టి కూడా ధర ఉంటుంది. శీతాకాలంలో అన్ని ప్రాంతాల్లో జామపండ్లు లభిస్తాయి..

ఒక్క పండు ఎన్నో లాభాలు..

జామ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

జామ ఆకులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయి. జామ ఆకుల టీ తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో భోజనం తర్వాత చక్కెర స్థాయిలు 10 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా జామపండ్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. యాంటీఆక్సిడెంట్లు గుండెను ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి.

జామపండ్లు కొలెస్ట్రాల్, రక్తపోటును కూడా తగ్గిస్తాయి. వీటిలోని ఫైబర్ కంటెంట్.. బరువును తగ్గేలా చేస్తుంది.

జామపండ్లు ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. ఈ పండులోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా కడుపును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

జామపండును ఎలాగైనా తినొచ్చు.. అల్పాహారంగా లేదా భోజనం తర్వాత జామపండును తినవచ్చు.. ఇంకా స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.. ఇంకా జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
సక్సస్ పక్కా.. కొత్త ప్రయత్నాలకు వారికికి బెస్ట్ టైమ్ ఇదే..!
సక్సస్ పక్కా.. కొత్త ప్రయత్నాలకు వారికికి బెస్ట్ టైమ్ ఇదే..!
బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.
బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్