అనన్య నాగళ్ల ఫిట్నెస్ మోటివేషన్ ఇదే.. అందం కోసం ఏం చేస్తుందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
అలాగే ఫిట్నెస్, లుక్స్ విషయంలోనూ నార్త్ బ్యూటీలకు గట్టి పోటీనిస్తున్నారు. ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు తెలుగు హీరోయిన్స్ జిమ్ లో చెమటలు చిందిస్తున్నారు.
ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల సైతం జిమ్ లో ఎక్కువగానే కష్టపడుతుందట. తన ఫిట్నెస్ కాపాడుకోవడానికి కఠినమైన వ్యాయమాలు చేస్తుందట ఈ అమ్మడు.
తన జిమ్ ట్రైనర్ సమక్షంలో కిక్ బ్యాక్ కాళ్లతో గట్టిగా తన్నుతున్న వీడియో సైతంలో షేర్ చేసింది. అలాగే రోజూ కూరగాయలు, ఇంట్లో చేసిన భోజనం తీసుకుంటుందట.
అలాగే సైక్లింగ్, వాకింగ్ చేయడంతోపాటు ప్రోటీన్, కాల్షియం, అధిక ఫైబర్ ఉండే పదార్థాలను తీసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ
మల్లేశం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో హిట్టు అందుకుంది.
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అనన్య.. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న పోటోస్ వైరల్ గా మారాయి.