New Year Scam: 2026 న్యూ ఇయర్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు హెచ్చరించారు. నకిలీ గ్రీటింగ్స్, షాపింగ్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి లింకులను క్లిక్ చేస్తే ఫోన్లో వైరస్ చేరి, మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. అపరిచితుల సందేశాలను విస్మరించండి.