కన్నడ భామకు క్యూ కడుతున్న టాలీవుడ్ క్రేజీ ఆఫర్స్.. 

23 December 2025

Pic credit - Instagram

Rajeev 

తెలుగులో సరైన హిట్ పడితే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోవచ్చు అని చాలా మంది ముద్దుగుమ్మలు రెడీగా ఉంటారు. 

అలా వచ్చి సక్సెస్ అయినా వారు చాలా మందే ఉన్నారు. వారిలో శ్రీనిధి శెట్టి ఒకరు. ఈ భామ కన్నడ నుంచి వచ్చింది. 

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ ,ఆతర్వాత కేజీఎఫ్ 2తో మరో హిట్ అందుకుంది. 

ఇక తమిళ్ లో కోబ్రా అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తెలుగులో ట్రై చేసింది. 

తెలుగులో నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. 

ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. ఇటీవలే తెలుసు కదా అనే సినిమా చేసింది. 

ఈ సినిమా కూడా మంచి రిజల్ట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరిన్ని ఆఫర్స్ ఈ అమ్మడికి వస్తున్నాయని తెలుస్తుంది