- Telugu News Photo Gallery Wrinkles under the eyes can be easily reduced with these eye packs, Check Here is Details
Get Rid of Wrinkles: కళ్ల కింద ముడతలా.. ఈ ఐ ప్యాక్‌తో బై చెప్పండి..
వయసు పెరిగే కొద్దీ కళ్ల కింద ముడతలు పడుతూ ఉంటాయి. దీంతో త్వరగా ముసలి వారిలా కనిపిస్తారు. చర్మం వదులుగా ఉండటం వల్ల త్వరగా ముడతలు వచ్చేస్తాయి. ఈ ముడతలను దూరం చేయడంలో ఈ చిట్కాలు చక్కగా పని చేస్తాయి..
Updated on: Dec 02, 2024 | 12:34 PM

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు పడటం కామన్. శరీరంలోని కళ్ల కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ముందుగా కళ్ల కింద ఉన్న చర్మమే ముడతలు పడుతూ ఉంటుంది. ఇక్కడ కొల్లాజెన్ ఉత్పత్తి ఆగిపోయి.. త్వరగా ముడతలు పడుతుంది.

30 ఏళ్లు దాటాయంటే చర్మంపై గీతలు కూడా పడతాయి. కానీ ఈ సమస్యను మనం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ఐ ప్యాక్ ట్రై చేస్తే.. కళ్ల కింద పడే ముడతలు త్వరగా పోతాయి.

ముందుగా ఐ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఇందుకు ముందుగా ఒక గిన్నెలోకి కొబ్బరి నూనె ఒక స్పూన్, వాజెలీన్ ఒక స్పూన్, తేనె అర స్పూన్ తీసుకుని ఇవన్నీ తగిన మోతాదులో తీసుకుని మిక్స్ చేసి ఓ మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రి పూట నిద్రించే ముందు కళ్ల చుట్టూ అప్లై చేయాలి. ఓ నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో త్వరగా ముడతలు పడకుండా ఉంటాయి.

అదే విధంగా ముడతలను దూరం చేయడంలో విటమిన్ కె కూడా చక్కగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా విటమిన్ కె కలిపి మిక్స్ చేసి.. కళ్ల చుట్టూ రాయండి. ఈ ప్యాక్ కూడా చక్కగా పని చేస్తుంది.




