- Telugu News Photo Gallery Obesity control tips: follow these expert suggested 5 morning breakfast habits In telugu
Obesity control tips: ఊబకాయం నియంత్రణ కోసం నిపుణుల సలహా.. ఈ ఐదు అలవాట్లు దినచర్యలో చేర్చుకోండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..
నేటి జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్యా అధికమే.. అనేక వ్యాధులను తెచ్చే ఈ ఊబకాయాన్ని నియంత్రించడం అంత సులభం కాదు. దీని కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం చేయడం ముఖ్యం. బరువు పెరగుతున్నాం అంటూ ఆందోళన చెందుతుంటే.. రోజుని నిపుణులు సూచించిన 5 అలవాట్లను అనుసరిస్తూ ప్రారంభించండి. దీంతో కొన్ని రోజుల్లోనే ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
Updated on: Dec 02, 2024 | 12:02 PM

ఊబకాయం అనేక ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఊబకాయం కారణంగా మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గడానికి, ప్రజలు జిమ్‌కు వెళ్లడంతోపాటు వివిధ పద్ధతులను అనుసరిస్తారు. అయితే ఊబకాయాన్ని నివారించాలంటే సరైన జీవనశైలిని అనుసరించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం తగ్గాలంటే ముందుగా రోజువారీ అలవాట్లను మార్చుకోమని చెబుతున్నారు పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్. ఇలా చేయడం వల్ల ఊబకాయం సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించమని సూచిస్తున్నారు. ఉదయాన్నే పాటించాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి చెప్పారు. ఇలా చేయడం వలన ఊబకాయం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని చెప్పారు.

ప్రోటీన్ ప్యాక్ చేసిన అల్పాహారం: అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. అయితే రోజుని ప్రారంభించే అల్పాహారంలో అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం ఉండాలి. ఆకలి హార్మోన్లను నియంత్రించడానికి ప్రోటీన్ పనిచేస్తుంది. అల్పాహారంగా తీసుకునే ఆహారంలో గుడ్లు, గ్రీక్ పెరుగు, చీజ్, నట్స్ ను చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల అతిగా తినే అలవాటు నుంచి బయటపడతారు.

తగినంత నీరు: ఉదయాన్నే శరీరం హైడ్రేట్ గా ఉండడం వలన జీవక్రియ వేగవంతం అవుతుంది. రోజంతా నిరంతరం నీరు తాగడం వల్ల బరువు తగ్గి శక్తి పెరుగుతుంది. రోజూ 34 నుంచి 68 ఔన్సుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజుని గోరు వెచ్చని నీటితో ప్రారంభించడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

సూర్యరశ్మిని తీసుకోవడం చాలా ముఖ్యం: శరీరానికి అవసరమైన విటమిన్ లో ఒకటి డీ.. ఇది సూర్య రశ్మి నుంచి లభిస్తుంది. కనుక ఉదయాన్నే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చర్యలు తీసుకోవాలి. విటమిన్ డి ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. సూర్యరశ్మి నేరుగా శరీరానికి తగలడం వలన అందులోని విటమిన్ డి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ 10-15 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండడం వల్ల బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

వ్యాయామం మిస్ అవ్వొద్దు: రోజువారీ వ్యాయామ దినచర్యను తప్పనిసరిగా పాటించండి. వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. ఉదయం నడక వలన జీవక్రియ పెరుగుతుంది.

ఇంట్లో తయారు చేసిన ఆహారం: స్థూలకాయాన్ని నివారించాలనుకుంటే.. ఇంటి ఆహారాన్ని మాత్రమే తినండి. ఇంట్లో తయారుచేసిన ఆహారం ఆరోగ్యకరం. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.




