జీడిపప్పులో దాగిన ఆరోగ్య రహస్యలు ఇవే..

02 December 2024

TV9 Telugu

TV9 Telugu

పోషకాహారం అనగానే చాలా మందికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పుల వంటివే గుర్తుకొస్తాయి. కానీ బాదం, జీడిపప్పు వంటి నట్స్‌, ఎండుఫలాల గురించి పెద్దగా పట్టించుకోం

TV9 Telugu

నిజానికివి మంచి పోషకాల గనులు. ముఖ్యంగా జీడిపప్పులో మేలిరకం కొవ్వులు, విటమిన్లతో పాటు ఫాస్ఫరస్‌, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు వీటిల్లో దండిగా ఉంటాయి

TV9 Telugu

జీడిపప్పు కీలకమైన అవయవాలు సరిగా పనిచేసేలా చూడటమే కాదు.. రకరకాల జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి. అందుకే జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు 

TV9 Telugu

ఇందులో చాలా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో విటమిన్ ఇ, కె, బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, మెరుస్తూ ఉండేలా చేస్తుంది

TV9 Telugu

జీడిపప్పులో విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6,  బి9 వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు మెదడు అభివృద్ధికి, శరీరానికి శక్తిని అందించడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి

TV9 Telugu

ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జీడిపప్పులో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది

TV9 Telugu

జీడిపప్పులో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

TV9 Telugu

జీడిపప్పులో ఐరన్ కూడా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. వీటిల్లోని మెగ్నీషియం, క్యాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి