Paya Shorba: చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

Paya Shorba: చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

Anil kumar poka

|

Updated on: Dec 01, 2024 | 1:34 PM

పాతబస్తీ ఇరానీ చాయ్.. దమ్ కి బిర్యానికి ఎంత ప్రాధాన్యమో.. అంతకు మించి ప్రాముఖ్యతను సంతరించుకుంది పాయ షేర్వా.. మరగ్ సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు కొనసాగుతుంది. అంతేకాదు మంచి ఆరోగ్య పోషక విలువలను సమకూర్చుకున్నది. చలికాలంలో మరి మక్కువగా ఇష్టపడుతారు. హైదరాబాద్ వాసులు ప్రత్యేక అల్పహారంగా ఆరగిస్తుంటారు.

ఎన్నో పోషకాలు ఇందులో దాగి ఉన్నాయంటారు. ఎముకలకు బలం చేకూర్చే కాల్షియం పాయలో సమృద్దిగా దొరుకుతుందని ఎక్కువగా మక్కువ చూపుతారు. చలి కాలంలో శరీరంలో వేడి పుట్టేందుకు ఎక్కువగా తింటుంటారు. నాన్ కి రోటి, తందూరి రోటి తో కలిపి పాయను ఆరగిస్తే ఆహా.. అనిపించేలా ఉంటుందని పాయ లవర్స్‌ అంటుంటారు. ఈ పాయ హోటళ్లు ఎక్కువగా పాతబస్తీ, ఆసిఫ్ నగర్, టోలిచౌకి లో ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ పాయ షేర్వా లభిస్తుంది. పాతబస్తీ హోటళ్లలో సాయంకాలం నుండే హోటళ్ల ముందు పెద్ద పెద్ద డేరాలు దర్శనమిస్తాయి. పాయ.. షేర్వా.. మరగ్ కోసం కిటకిటలాడుతుంటాయి. ప్రధానంగా మదీనా, చార్మినార్, ఆసిఫ్ నగర్ టోలిచౌకి తదితర ప్రాంతాలలోని హోటళ్లలో ప్రత్యేకంగా పాయ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. పాతబస్తీలో కొన్ని తరాల నుంచి వారసత్వంగా పాయ హోటళ్లు నిర్వహిస్తున్నారు. కేవలం పాయ కోసం హోటళ్లకు వచ్చే వారున్నారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తినడమే కాకుండా, పార్శల్స్‌ కూడా తీసుకెళ్తుంటారన్నారు.

పాయ అంటే కాలు అని అర్థం. మేక, పొట్టేళ్ల కాళ్లను ఉడికించి తయారీ చేసే ఆహారం పదార్థమే ఈ పాయ షేర్వా. పాయ షేర్వా తాయరీని ప్రత్యేకంగా తయారు చేస్తారు. లేత మేక, పొట్టేలు కాళ్లను ఒక పెద్ద వంట పాత్రలో వేసి నీటిని పోసి సమారు ఎనిమిది గంటల పాటు బాగా ఉడికిస్తారు. ఉడికిన మేక కాళ్లను ప్రత్యేకంగా తయారు చేసిన మసాల దినుసులతో షేర్వా లో వేసుకొని అరగిస్తారు. ఈ షేర్వాను కొబ్బరి, పిస్తా బాదం కుంకుమపువ్వు, జీడిపప్పు, పల్లీలు, గరంమసాలలతో పాటు బాగా మరగబెడతారు. పూర్తిగా తయారయిన షేర్వాలో అప్పటికే బాగా ఉడకబెట్టిన మేక కాళ్లను వేస్తారు. దీనిపై కోతీమీర చల్లడంతో పాయ తయారీ పూర్తి అయినట్లే. ఈ పాయ షేర్వాలు తినడంతో ఎముకలు దృఢత్వాన్ని. పొందుతాయంటారు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.