Railway: ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

Railway: ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

Anil kumar poka

|

Updated on: Dec 01, 2024 | 1:22 PM

శీతాకాలంలో ఉదయం, సాయంత్రం దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు, కాలుష్య ప్రభావం రైలు ప్రయాణంపై కూడా కనిపిస్తోంది. దీని కారణంగా భారతీయ రైల్వే ప్రతిరోజూ అనేక రైళ్లను నిలిపివేస్తోంది. పొగమంచు కారణంగా ఐఆర్‌సీటీసీ 30కి పైగా రైళ్లను రద్దు చేసింది. ఇది కాకుండా, అనేక రైళ్ల సమయ వేళలు సైతం మార్చగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.

పలు రైళ్లను రద్దు చేయడమే కాకుండా పలు రైళ్ల వేగాన్ని తగ్గించారు. పొగమంచు కారణంగా నిర్మాణ పనుల కారణంగా రద్దు అయిన రైళ్లు కూడా ఉన్నాయి. రద్దైన రైళ్లు చూస్తే.. రాయ్‌పూర్-లక్నో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 26, 29 తేదీల్లో రద్దు చేశారు.. దుర్గ్-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 26, 29 తేదీల్లో రద్దు చేశారు. చిర్మిరి-అనుప్పూర్ ప్యాసింజర్ ప్రత్యేక రైలు నవంబర్ 26, 28, 30 తేదీలలో రద్దు చేయగా.. కట్ని-చిర్మిరి మెము ప్రత్యేక నవంబర్ 23, 30 తేదీలలో రద్దు అయ్యింది

చిర్మిరి-ఖత్ని ప్రత్యేక నవంబర్ 24 నుండి డిసెంబర్ 01 వరకు రద్దు చేయగా.. బిలాస్‌పూర్-ఇండోర్ నర్మదా ఎక్స్‌ప్రెస్ రైలు నవంబర్ 23 నుండి 30 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇండోర్-బిలాస్‌పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్, నవంబర్ 23 నుండి డిసెంబర్ 1 వరకు.. బిలాస్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ 23 నుండి 23 వరకు రద్దు చేశారు. భోపాల్-బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 23 నుండి డిసెంబర్ 02 వరకు… జబల్‌పూర్-అంబికాపూర్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 23 నుండి 30 వరకు రద్దు చేశారు. అంబికాపూర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 24 నుండి డిసెంబర్ 01 వరకు రద్దు చేయగా.. బిలాస్‌పూర్- రేవా ఎక్స్‌ప్రెస్ డిసెంబర్‌ 1 వరకు రద్దు చేశారు. రేవా-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 23 నుండి డిసెంబర్ 01 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.