Udaipur Family: రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు ఘర్షణకు దారి తీసింది. కొత్త మహారాజుగా పట్టాభిషేకం చేసిన విశ్వరాజ్ సింగ్‌కు ప్యాలెస్ వద్ద అవమానం జరిగింది. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి కొత్త మహారాజును అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని దాయాదులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఇరువర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.
రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ మహారాజుగా ఉన్న మహేంద్ర సింగ్ ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ కు 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది.
అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంతో ఉన్న అరవింద్ సింగ్ ..కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన చేశారు. అరవింద్ సింగ్ ఉదయ్‌పూర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. ఈ క్రమంలో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి అడుగుపెట్టనివ్వనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్యాలెస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కొత్త మహారాజు విశ్వరాజ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి కోటకు చేరుకోగా, అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని అడ్డుకుంది. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లదాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుండి చెదరగొట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

