Viral: మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

Viral: మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

Anil kumar poka

|

Updated on: Dec 02, 2024 | 11:52 AM

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుర్రపుకొండలో విచిత్ర సంఘటన జరిగింది. అగ్నిగుండం చుట్టూ గొర్రెలు ప్రదక్షిణ చేశాయి. ఈ సంఘటనతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. గ్రామంలో తాడి నాగమ్మ, కాటమరాయ దేవతల ఉత్సవాల సందర్భంగా అగ్ని గుండాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. కణకణ మండే నిప్పుల గుండం మీద భక్తులు నడిచారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిప్పుల గుండం నుంచి నడిచేందుకు పోటీ పడ్డారు. తెలిసీ తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకున్నారు. పంటలు బాగా పండాలని ప్రార్థించారు. రైతులు తీసుకొచ్చిన ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలు అగ్ని గుండంలో వేసి దేవుడిని కొలిచారు. అనంతరం అగ్నిగుండం చుట్టూ గొర్రెలు ప్రదక్షిణలు చేశాయి. అగ్నిగుండం చుట్టూ ఒక గొర్రెను ముందుగా ప్రదక్షిణ చేయించగా.. దానిని అనుసరించి మిగిలిన గొర్రెలు కూడా ప్రదక్షిణ చేశాయి. అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల గొర్రెలు, పశువులకు వ్యాధులు సోకవని గొర్రెల కాపర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు గ్రామస్తులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.