అయితే తాజాగా ఆస్తమా చికిత్సకు సంబంధించి సైంటిస్టులు మరో ముందడుగు వేశారు. దాదాపు 50 యేళ్లు శ్రమించి దీనికి మందు కనుగొన్నారు. తీవ్ర ఆస్తమా వ్యాధికి 'బెన్రలిజుమాబ్' అనే మందును కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసర ఆసుపత్రిలో చేరడాన్ని తగ్గించడాన్ని, ఉబ్బసం, COPD పరిస్థితులను నివారించడానికి ఎంతో ఉపయోగించబడుతుందని వారు చెబుతున్నారు.