AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూఇయర్ ప్లానింగ్‌లో కుర్రోళ్లు.. స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్స్ చేసిన పోలీసులు.. పార్టీ అండర్ లిమిట్స్!

పద్దతిగా పార్టీ చేసుకుంటారా.. లేదా జైల్లో కూర్చుంటారా..? సింగిల్ లైన్ ఎజెండా. ఇందులో వేరే బేరాల్లేవ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్..! స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసులు. ఏదో జరిగాక చర్యలు తీసుకోవడం కాదు. పట్టుబడేంత వరకు వేచి చూడడం కాదు. తాగి ఊగుతున్నప్పుడు కేసులు బుక్ చేయడం కాదు.. ఈసారి రూట్ మార్చారు పోలీసులు. న్యూ ఇయర్‌కి రెండు మూడు వారాల నుంచే.. 'వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ' అనే సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. అబ్జర్వ్ చేసే ఉంటారు.. సిటీ రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లు బాగా పెరిగాయి. అదంతా ముందస్తు హెచ్చరికల్లో భాగమే. ఆల్రడీ ఫామ్‌హౌజ్ టీమ్స్, పబ్స్‌ను వాచ్ చేయడం కోసం టీమ్స్, డ్రగ్స్ సిటీలోకే ఎంటర్ కానివ్వకుండా స్పెషల్ టీమ్స్ అలర్ట్‌గా ఉన్నాయి. ఈ న్యూఇయర్‌కి ఒక్క ఇన్సిడెంట్ జరక్కూడదనే ఇంత ప్లానింగ్..!

న్యూఇయర్ ప్లానింగ్‌లో కుర్రోళ్లు.. స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్స్ చేసిన పోలీసులు.. పార్టీ అండర్ లిమిట్స్!
Police Guidelines For New Year 2026
Balaraju Goud
|

Updated on: Dec 19, 2025 | 9:50 PM

Share

ఓ వారం క్రితం.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌పై స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రైడ్ చేసింది. ఏం లేదు.. సరదాగా పార్టీ చేసుకుంటున్నారంతే. అదే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి సైతం కనిపించారు. ఆ పర్సనాలిటీస్ అక్కడ కనిపించే సరికి పోలీసులు చేసిన ఆ రైడ్ హైలైట్ అయింది. కాని, ఈమధ్య ఇలాంటి పార్టీలపై డేగ కళ్లతో నిఘా వేసి ఉంచుతున్నారు ఖాకీలు. అది చిన్నపాటి బర్త్‌డే పార్టీ అయినా సరే. ఇట్టే వాసన పసిగట్టేస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. జస్ట్ ఓ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ ఊరవతల ఓ రిసార్ట్‌లో పార్టీ జరిగింది. కాస్త పెద్దోళ్లే ఉన్నారా ఈవెంట్‌లో. అక్కడా రైడ్స్ జరిగాయ్, అదుపులో తీసుకోవడమూ జరిగింది. ఇలా ఎక్కడ పార్టీ జరిగినా సరే.. పట్టేస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ టీమ్స్ ఉన్నాయ్. మఫ్టీలో తిరుగుతూ అబ్జర్వ్ చేసే బ్యాచ్‌లున్నాయ్. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే.. రాబోయే న్యూఇయర్ కోసం హైదరాబాద్ పోలీసులు ఓ స్ట్రాంగ్ మెసేజ్ పంపించదలచుకున్నారు. ‘పార్టీ చిన్నదా పెద్దగా అని కాదు.. ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా’. ‘రూల్స్ పాటిస్తున్నారా లేదా’. ఇదొక్కటే చూస్తున్నారు. న్యూఇయర్ రోజు హడావుడి చేయడం కాకుండా.. దాదాపు 15, 20 రోజుల ముందే అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు. ఒకవిధంగా ‘డోంట్ బ్రేక్ ద రూల్స్’ అనే వార్నింగ్స్ ఇస్తున్నారు. న్యూఇయర్ కోసం స్పెషల్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. బాగా ఎంజాయ్ చేయండి, ఎంతైనా ఆనందించండి.....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి