ఇవి మొలకలు కాదు.. అమృతంతో సమానం.. దెబ్బకు షుగర్ పరార్
01 December 2024
Shaik Madar Saheb
చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు.. అలాంటివారికి మొలకెత్తిన మెంతి గింజలు ఎంతో మేలు చేస్తాయి.
మొలకెత్తిన మెంతిగింజలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీంతోపాటు బీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని నివారిస్తాయి.
విటమిన్ సితో పాటు విటమిన్ ఎ, బి కూడా ఇందులో ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, ఫైబర్‌తోపాటు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఇందులో ఉండే పీచు పొట్టను మృదువుగా ఉంచుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మెంతి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి.
మొలకెత్తిన మెంతుల్లో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు నియంత్రణలో సహాయపడతాయి..
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్ ప్రభావాలు స్త్రీపురుషుల హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి.
మెంతులు మొలకెత్తాలంటే: ముందుగా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని తొలగించాలి.. ఆ తర్వాత ఒక గుడ్డలో చుట్టాలి. రెండు రోజుల తర్వాత మెంతి మొలకలు వచ్చేస్తాయి.