విశాఖ టూ అండమాన్ ఐఆర్సీటీసీ టూర్ డిసెంబర్ 5న మొదలుకానుంది. ఈ టూర్ ఎల్టీసీ స్పెషల్ అండమాన్ ఎమరాల్డ్స్ పేరుతో 6 రోజులు ఉండనుంది.
ఈ టూర్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 75115, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 58860, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 57230, చైల్డ్ విత్ బెడ్(5-11 సం) రూ. 50270, చైల్డ్ వితవుట్ బెడ్ (5-11 సం) రూ. 46810గా ఉంది.
డిసెంబర్ 5న విశాఖపట్నం నుంచి ఉదయం 08:35కి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:00కి పోర్ట్ బ్లెయిర్ చేరుకోని హోటల్‌లో ఫ్రెష్ అవుతారు.
తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్ చూసి సెల్యులార్ జైలుకి చేరుకొని అక్కడ లైట్ & సౌండ్ షోను చూసి పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు.
రెండవ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత రాస్ ఐలాండ్, నార్త్ బే సందర్శించి భోజనం చేస్తారు. తర్వాత సముద్రిక మ్యూజియం చూసి పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
3వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి హావ్‌లాక్ ఐలాండ్ చేరుకొని హోటల్‌లో దిగి సాయంత్రం రాధానగర్ బీచ్ చూసి హావ్‌లాక్ ద్వీపంలోనే రాత్రి బస ఉంటుంది.
4వ రోజున కాలాపత్తర్ బీచ్‌ను చూసి ప్రీమియం క్రూయిజ్‌లో నీల్ ఐలాండ్ చేరుకొని అక్కడ నేచురల్ బ్రిడ్జ్, లక్ష్మణపూర్ బీచ్‌ను సందర్శించి డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
డే 5లో భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదించి బ్రేక్ ఫాస్ట్ తర్వాత క్రూయిజ్‌లో పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకొని షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేస్తారు.
ఆరవ రోజు ఉదయం 07:25 గంటలకు పోర్ట్ బ్లెయిర్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 11:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.