నీరు లేకుండా అంగారకుడిపై జీవితం సాధ్యమేనా?

TV9 Telugu

27 November 2024

గత కొన్నేళ్లుగా, అంగారకుడిపై నీటి ఉనికిని రుజువు చేయడనికి ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ఈ ప్రశ్న మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అంగారక గ్రహం భూమి పరిమాణంలో సగం ఉంటుంది. దాని వాతావరణం కూడా అనుకొన్న దాని కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

అంగారక గ్రహం ధ్రువాలపై మంచు పలకలు ఉన్నాయని, అందులో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

మార్స్ ఉపరితలంపై కనిపించే కొన్ని ఖనిజాలలో నీటి జాడలు కనుగొనబడ్డాయి. ఇది గతంలో అంగారకుడిపై నీరు ఉందని సూచిస్తుంది.

వివిధ నాసా అంతరిక్ష నౌకలు పంపిన డేటా మార్స్ గ్రాహం ఉపరితలం క్రింద నీటి నిల్వలు ఉండవచ్చని సూచిస్తుంది.

మనిషి జీవితానికి నీరు చాలా ముఖ్యమైనది. భూమిపై ఉన్న అన్ని జీవరాశులు జీవించడానికి నీరు కచ్చితంగా అవసరం.

ఈ గ్రహంపై జీవించడానికి నీరు కూడా అవసరం. అంగారక గ్రహంపై ఉన్న జీవితం భూమిపై ఉన్న జీవితం వలె ఉండవలసిన అవసరం లేదు.

నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అయితే, నీరు లేకున్నా అంగారకుడిపై జీవం సాధ్యమవుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.