విమనం ల్యాండింగ్ సమయంలో వేగాన్ని తగ్గించాలి. దీని కోసం, విమానాలలో అనేక రకాల బ్రేకింగ్ సిస్టమ్‌లు ఉంటాయి. వాటి సహాయంతో సురక్షితంగా ఆపగలరు.
విమానాలు గాలిలో ఉన్నప్పుడు కూడా బ్రేకులు ఉపయోగపడుతాయి. విమానంలో ఒక్కో సమయంలో వేరు వేరు బ్రేకులు ఉపయోగిస్తారు.
విమానాల రెక్కలపై వింగ్ స్పాయిలర్లు అమర్చబడి ఉంటాయి. ల్యాండింగ్ సమయంలో వీటితో గాలిని ఆపడం ద్వారా విమానం వేగాన్ని తగ్గిస్తారు.
విమానాలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి కార్ల బ్రేక్‌ల వలె పని చేస్తాయి. ఇవి చక్రాలకు కనెక్ట్ అయ్యి ఉంటాయి.
విమానం నేలపై ల్యాండ్ అయినప్పుడు, ఈ బ్రేక్‌లు వేస్తారు. దీంతో విమానాల వేగం తగ్గుతుంది. అనంతరం నెమ్మదిగా ఆగిపోతుంది.
ఎయిర్‌ప్లేన్ ఇంజిన్‌లు ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దీనిని రివర్స్ థ్రస్ట్ అంటారు. సాధారణంగా ఇంజిన్ థ్రస్ట్ వెనుకకు వస్తుంది, దీని కారణంగా విమానం ముందుకు కదులుతుంది.
ల్యాండింగ్ సమయంలో, పైలట్లు ఇంజిన్ థ్రస్ట్‌ను రివర్స్ చేస్తారు. దీంతో థ్రస్ట్ ముందు వైపుకు వస్తుంది. గాలికి వ్యతిరేక దిశలో కదలడం వల్ల విమానం వేగం తగ్గుతుంది.
గాలిలో ఎగురుతున్నప్పుడు బ్రేకులు వేయడానికి ఎయిర్ బ్రేకులు ఉపయోగిస్తారు. ఇవి రెక్కలపై అమర్చబడి గాలి శక్తిని ఆపడం ద్వారా విమానం వేగాన్ని తగ్గిస్తాయి.