ముల్లంగి ఔషధాల గని.. చలికాలంలో తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా 

02 December 2024

 Pic credit - Getty

TV9 Telugu

ముల్లంగిలో విటమిన్లు ఇ, ఎ, సి, బి6, కె లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.

పోషకాలు మెండు 

ముల్లంగిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో వచ్చే కఫం, జలుబు, దగ్గు నుంచి రక్షణనిస్తుంది. 

రోగనిరోధక శక్తి

ముల్లంగిలో అధిక మొత్తంలో పైబర్ ఉంటుంది. సలాడ్ రూపంలో ముల్లంగిని తినడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అంతేకాదు కాలేయం, మూత్రాశయాన్ని కూడా రక్షిస్తుంది.

జీర్ణ వ్యవస్థ 

ముల్లంగి శరీరానికి పొటాషియంను సరఫరా చేస్తుంది. హైపర్ టెన్షన్ ఉన్నవారు తినే ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవాలి. ముల్లంగి రక్తపోటు నియంత్రిస్తుంది

రక్తపోటు నియంత్రణ  

ముల్లంగి జీర్ణవ్యవస్థకు మేలు  చేస్తుంది. దీంతో ఎసిడిటీ, ఊబకాయం, గ్యాస్ట్రిక్ సమస్యలు, వికారం వంటి సమస్యలను నయం చేయడంలో  మంచి సహాయకారి. 

ఎసిడిటీ, ఊబకాయం సమస్యలకు 

ముల్లంగిలో ఫోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ తో పాటు ఆంథోసైనిన్‌లకు మంచి మూలకం. ఇవి రక్తంలో ఆక్సిజన్ సరఫరాను పెంచడమే కాదు గుండె సరిగ్గా పని చేసేందుకు సహాయపడతాయి.  

గుండె జబ్బులు

ముల్లంగి రసంలో విటమిన్ సి, ఫాస్పరస్ ఉంటాయి. దీంతో చర్మంలో మెరుపు సంతరించుకుంటుంది. పొడి చర్మం, మొటిమలను కూడా తొలగిస్తుంది.  

స్కిన్ కేర్