బాగా పండిన అరటి పండ్లు పడేస్తున్నారా..? మీరు ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్లే..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అరటి పండును ఇష్టపడని వారంటూ ఉండరు. పైగా ఇది సీజన్‌తో సంబంధం లేకుండా, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ధరలో లభిస్తుంది. అంతేకాదు. అరటి పండు ఆరోగ్య పరంగా కూడా ఔషధ గని అంటారు. అయితే, అరటి పండు బాగా పండినప్పుడు చాలా మంది దానిని తినడానికి ఇష్టపడరు..కానీ, బాగా పండిన అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 02, 2024 | 5:08 PM

బాగా పండిన అరటి పండులో టన్నుల కొద్దీ పోషకాలు ఉంటాయని మీకు తెలుసా..? శరీరానికి సరైన జీవక్రియలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. సులభంగా జీర్ణం అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, మలబద్దకం, అసిడిటీని దూరం చేస్తుంది. విరేచనాలు తగ్గుతాయి.

సాధారణంగా పండిన అరటి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కారణాన, కణ నష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత డ్యామేజీలు, ఫ్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి బాగా పండిన అరటి పండు ఉపయోగపడుతుంది.

అరటి పండ్లు అల్సర్స్ సమస్యతో బాధపడుతున్న వారికి, అత్యంత లాభదాయకమైన పండుగా ఉంటుంది. అల్సర్ సమస్యతో ఉన్న వ్యక్తి నిస్సంకోచంగా ఈ పండిన అరటి పండును తీసుకొనవచ్చు. అలాగే, పండిన అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మరియు సోడియం నిక్షేపాలు తక్కువగా ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి మేలు చేస్తుంది.

ఒక మోస్తరుగా పండిన అరటి పండ్ల కన్నా బాగా పండిన అరటి పండ్లలోనే పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లను తింటేనే శక్తి బాగా లభిస్తుంది. దీంతో అలసిపోకుండా పనిచేయవచ్చు.

అరటిపండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిల్లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. అరటిపండ్లు మలబద్ధకం, కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందించినప్పటికీ, వీటిని తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.




