Chevella Road Accident: కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు దుర్మరణం
హైదరాబాద్- బీజాపూర్ రహదారి వద్ద 50 మంది కూరగాయలను అమ్ముతుండగా ఈ క్రమంలో ఒక్కసారిగా అటువైపుగా వస్తున్న లారీ వారిపైకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చేర్చించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చేర్చించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.