Indian Army: భారత సైన్యంలో చేరాడానికి దారులెన్నో.. వీరి జీతభత్యాలు, పెన్షన్లు, అలవెన్సులు ఎలా ఉంటాయంటే..
ఇండియన్ ఆర్మీలో చేరడానికి మార్గాలు, జీతభత్యాలు, అలవెన్సులు, పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే దేశ వ్యాప్తంగా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అవేంటో మీకోసం..
All About Indian Armed Forces : భారత త్రివిధ సైన్యానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక బలం మనదేశానిదే కావడం గమనార్హం (వియత్నం మొదటి స్థానంలో ఉంది). మన దేశా భద్రతా దళంలో సుమారు 14 లక్షల సైన్యం పనిచేస్తోంది. సాయుద బలగాలను ఆధునీకరించడానికి, రక్షణ శాఖకు కేటాయించే బడ్జెట్‌ను సమర్ధవంతంగా వినియోగించడానికి, నాలుగేళ్ల ప్రాతిపదికన అగ్నివీరులను నియమించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐతే విద్యావేత్తలు, మాజీ సైనిక అధికారులతలోపాటు దేశ యువత మాత్రం పెద్ద ఎత్తున ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా సైనికోద్యోగులకు చెల్లించే అలవెన్సులు, సదుపాయాలు ఏవిధంగా ఉంటాయో, ఎన్ని విధాలుగా భారత ఆర్మీ నియామకాలు చేపట్టుతారో, ఎప్పుడెప్పుడు నియామకాలు చేపడుతుందో, జీతాలు, పెన్షన్ సదుపాయాలు ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
భారత రక్షణ దళాల్లో చేరాలంటే ఎన్నో మార్గాలు.. పూర్తి వివరాలు ఇవే..
పురుషులకు సంబంధించి శాశ్వత కమీషన్లు (Permanent Commissions) ఏమేమంటే..
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఖడక్వాస్లా, పూణే
- ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), డెహ్రాడూన్ (నాన్-టెక్నికల్)
- డెహ్రాడూన్‌లో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (IMA-TGC), డెహ్రాడూన్
- డెహ్రాడూన్‌లో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (IMA-UES), డెహ్రాడూన్
- టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (IMA-TGC) (ఆర్మీ ఎడ్యుకేషన్ సిబ్బంది), డెహ్రాడూన్
- 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES)
షార్ట్ సర్వీస్ కమిషన్ (పురుషులు, స్త్రీలు), చెన్నై
- షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) (నాన్-టెక్నికల్)
- షార్ట్ సర్వీస్ కమిషన్ NCC (SSC) స్పెషల్/ఎంట్రీ
- షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్
- షార్ట్ సర్వీస్ కమిషన్ (జడ్జి అడ్వకేట్ జనరల్) (SSC)
- షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్, న్యూఢిల్లీ
- మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (స్త్రీలు)
శాశ్వత కమిషన్ రిక్రూట్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది?
పదవీ విరమణ వరకు ఆర్మీలో కొనసాగే సర్వీసులను పర్మినెంట్ కమిషన్ (PC) పరిధిలో ఉంటాయి. అందుకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లేదా ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో చేరవల్సి ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణతతో సాధారణంగా ప్రతీయేట మార్చి- జూలై మధ్యలో, అలాగే అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో NDA నియామకాలకుగానూ యూపీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఎంపిక పరీక్షలో అర్హత సాధించినవారు ఎన్డీఏ ఇచ్చే మూడేళ్ల కోర్సును పూర్తి చేసిన తర్వాత ఐఎమ్‌ఏలో యేడాది ట్రైనింగ్‌కు పంపిస్తారు. ఐఎమ్‌ఏలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను పూర్తి చేయవల్సి ఉంటుంది. అనంతంర ఐఎమ్‌ఏలో 18 నెలల ట్రైనింగ్ ఉంటుంది.
టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు బీఈ/బీటెక్ అర్హతతో యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఐఏమ్ఏ, ఎన్డీఏ ప్రవేశాలకు ఒకేసారి నోటిఫికేషన్లు విడుదలౌతాయి. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు యూఈఎస్ (UES) పోస్టులకు రాత పరీక్షలేకుండా ఎంపిక చేస్తారు.
షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కేటగిరీల్లో పోస్టులకు కామన్ అప్లికేషన్ టెస్టుల ద్వారా కనీసం 10 ఏళ్ల ప్రాతిపదికన సర్వీసుకు ఎంపిక చేస్తారు. ఐతే ఈ కేటగిరీలో చేరిన అభ్యర్థులు పెన్షన్ సదుపాయం పొందాలంటే కనీసం 20 యేళ్ల సర్వీసు ఉండాలి. ఈ సర్వీసుల్లో గరిష్ఠంగా 14 ఏళ్లకు మాత్రమే సర్వీసును పొడిగిస్తారు. ఐదే పీసీ, ఎస్సెస్సీ కేటగిరీ పోస్టులకు జీతభత్యాలు, ఇతర అలవెన్సు లు ఒకే విధంగా ఉన్నప్పటికీ పెన్షన్, మెడికల్ అలవెన్సుల్లో మాత్రమే ఈ తేడాలుంటాయి.
సైన్యంలో ఎన్ని ఏళ్లపాటు కొనసాగవచ్చు..
ఒక అభ్యర్థి సైన్యంలో చేరిన తర్వాత 10 యేళ్ల పాటు కమీషన్డ్ ఆఫీసర్‌గా పని చేయవచ్చు. ఈ పోస్టు ముగింపులో రెండు ఎంపికలు ఉంటాయి. PCగా కొనసాగడం లేదా రిటైర్‌మెంట్. పీసీగా కొనసాగని పక్షంలో నాలుగేళ్ల పొడిగింపు ఉంటుంది.
ఇండియన్ ఆర్మీలో మూడు ర్యాంకులుంటాయి..
- కమీషన్డ్ ఆఫీసర్లు (ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఎ సర్వీస్)
- జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు (గ్రూప్ బీ)
- ఓఆర్ ఆఫీసర్లు
సైన్యంలో పదవీ విరమణ వయస్సు ఎంత?
- లెఫ్టినెంట్ జనరల్ లేదా మేజర్ జనరల్ సర్వీసులకు 60 యేళ్లు
- బ్రిగేడియర్ సర్వీస్‌కు 59 యేళ్లు
- లెఫ్టినెంట్ కల్నల్ అంతకంటే తక్కువ సర్వీసులకు 58 యేళ్లు
భారత సైన్యంలో ప్రతీ యేట ఎంత మంది చేరుతున్నారు?
రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించనప్పటికీ, ప్రతీయేట లక్షల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ప్రతీ యేట దాదాపు 60,000 మంది సిబ్బంది పదవీ విరమణ చేస్తుంటారు. వారి స్థానంలో సైన్యం నియామకాలకు 100 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఐతే గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు చేపట్టలేదు. దీనికి బదులుగానే అగ్నిపథ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది.
యూనిఫాం పోస్టులకు సంబంధించి ఇండియన్ ఆర్మీలో 85 శాతం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 10 శాతం, ఇండియన్ నేవీ 5 శాతం ఉంటారు. ఇందులో ఆఫీసర్ కేడర్ 5 శాతం మాత్రమే.
భారత సైనికుల జీతాలు ఎలా ఉంటాయంటే..
మంచి జీతాలకోసం ఆశించేవారు కార్పొరేట్ ఉద్యోగంలో చేరడం మంచిది. సాధారణంగా ఏడాది జీతం రూ. 8,83,894 (అన్ని అలవెన్సులతో కలిపి)గా ఉంటుందని అంచనా.
డిఫెన్స్ సర్వీసులకు అందించే ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయంటే..
రక్షణ దళంలో పనిచేసే సిబ్బందికి ఉచిత వసతి లభిస్తుందని అందరూ అనుకుంటారు. నిజానికి అది క్వార్టర్స్ సబ్సిడీకి కిందికి వస్తుంది. వారి ర్యాంక్, పోస్టింగ్ ఆధారంగా ఇది వర్తిస్తుంది. సాధారణంగా ఒక జవాన్‌కు 1BHK కేటాయిస్తారు. JCO పోస్టులకు 2/3BHK, మేజర్/లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ హోదా అధికారులకు 3/4/5 BHK ప్లాట్ లేదా ఇల్లు అందిస్తారు. బ్రిగేడియర్ ర్యాంకు అధికారులకు సొంతంగా ఇళ్లు కేటాయిస్తారు.
సైనికోద్యోగుల కుటుంబాలకు అందించే వైద్య సదుపాయాలు, విద్య సదుపాయాలు ఇలా..
రక్షణ దళంలో సేవలందించే సైనికులు లేదా మాజీ సాయుధ సిబ్బంది అందరికీ ఉచిత వైద్య సౌకర్యం ఉంటుంది. మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS) అనేది మాజీ సైనికులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన వారికి నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేందుకు Ministry of Defence ఏర్పాటు చేసిన పథకం.
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల్లో ఆర్మీ సిబ్బంది పిల్లలను తక్కుక ఫీజుతో చదివించవచ్చు
ఆర్మీ క్యాంటీన్ గురించి ఎప్పుడైనా విన్నారా.. భారత సైనికులు లేదా మాజీ సైనికాధికారుల కుటుంబాలకు రాయితీతో కూడిన కిరాణా (నిత్యవసర) వస్తువులను సబ్సీడీ ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులను ఇస్తారు. వీరికి రేషన్ సదపాయం కూడా ఉంటుంది.
ఆర్మీ సిబ్బందికి పెన్షన్లు ఇవ్వలేకనే అగ్నిపథ్..?
డిఫెన్స్ పెన్షన్.. అగ్నిపథ్ పథకంలో పెన్షన్‌లేదని దేశ మంతా బగ్గుమంటోంది. జూలై 1, 2014 నుండి అమల్లోకి వచ్చిన వన్-ర్యాంక్-వన్-పెన్షన్ (OROP) స్కీమ్‌కు ద్వారా ఎప్పటికప్పుడు పెరుగుతున్న పెన్షన్ల బిల్లుల గురించి తెలుసుకోవచ్చు. దేశంలో నానాటికీ పెన్షన్ బిల్లులు తలకు మించి బారంగా పెరిగిపోతున్నాయి. 2015-16లో (OROP ప్రవేశపెట్టక ముందు) డిఫెన్స్ పెన్షన్ రూ. 54,000 కోట్లుగా ఉండగా, అది 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,33,825 కోట్లకు అంటే రెండింతలు పెరిగింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (IDSA) అంచనా ప్రకారం, 2011-12లో మొత్తం మూలధన ఖర్చులో పెన్షన్లకు 11 శాతం ఖర్చుకాగా 2020-21 నాటికి 25 శాతానికి పెరిగింది. దీంతో అర్హులైన భారత సైనికాధికారులకు పెన్షన్ ఇవ్వలేక చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద అగ్నిపథ్ పథకం రూపుదల్చడానికి కారణంగా చెబుతోంది. దీనిపై మీ అభ్రిప్రాయం ఏమిటో కింద కామెంట్ల రూపంలో తెల్పిండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.