Fabric Designing Career: మీలో సృజనాత్మకత ఉందా.. ఫాబ్రిక్ డిజైనింగ్ బెస్ట్ ఆప్షన్.. ఫుల్ డీటైల్స్ మీకోసం..
ఫ్యాబ్రిక్ డిజైనింగ్ రంగంలో అనేక కెరీర్ అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు ఫ్యాషన్ పరిశ్రమలో గొప్ప కెరీర్ చేయవచ్చు. విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
Fabric Designing Career: ప్రస్తుతం ఫ్యాషన్ పట్ల వయసుతో సంబంధం లేకుండా మక్కువ పెరుగుతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో.. దుస్తులు శరీరాన్ని కప్పడానికి మాత్రమే కాకుండా మనిషి వ్యక్తిత్వానికి, సామాజిక స్థితికి చిహ్నంగా మారాయి. బట్టల రంగు, నాణ్యత, డిజైన్ ఒక వ్యక్తి గురించి చాలా చెబుతాయి. ప్రస్తుతం యువత ఫాబ్రిక్ డిజైన్‌పై చాలా శ్రద్ధ చూపుతోంది. ఫ్యాషన్‌పై పెరుగుతున్న క్రేజ్ కారణంగా.. కరోనా కాలంలో కూడా ఈ రంగంలో 51 శాతం వృద్ధి నమోదైంది. వృత్తిపరమైన ఫాబ్రిక్ డిజైనర్ల డిమాండ్ ఏడాది ఏడాదికి పెరుగుతున్నట్లు జాబ్ మార్కెట్ డేటా చూపిస్తుంది. మీరు ఫ్యాషన్ ట్రెండ్‌లను అర్థం చేసుకుని.. ఫాబ్రిక్‌కు సృజనాత్మక రూపాన్ని ఇస్తే.. మీరు కూడా ఫాబ్రిక్ డిజైనర్‌గా మారవచ్చు .
ఫ్యాబ్రిక్ డిజైనింగ్‌లో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారి కోసం పూర్తి వివరాలు: ఫాబ్రిక్ డిజైనింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందుతారు. తరుణ్ తహిలియాని, రోహిత్ బాల్, రీతూ బేరి, మాలినీ రమణి, మనోవిరాజ్ ఖోస్లా వంటి డిజైనర్స్ లా ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే.. ఫాబ్రిక్ డిజైనింగ్ మీకు గొప్ప కెరీర్ ఎంపిక. యువతలో ఫాబ్రిక్ డిజైనింగ్ కోర్సులకు ఆదరణ నిరంతరం పెరుగుతోంది. ఈ కోర్సు ద్వారా మీరు ఫ్యాషన్ పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టవచ్చు.
ఫ్యాబ్రిక్ డిజైనర్.. వర్క్ ప్రొఫైల్ ఫాబ్రిక్ డిజైనర్ బట్ట నాణ్యతను అర్థం చేసుకోవడంతోనే సగం సక్సెస్ అందుకుంటారు. ఫ్యాషన్ ట్రెండ్‌లకు అనుగుణంగా దానిని ఉపయోగిస్తాడు. డిజైనర్ సృజనాత్మకత ఫాబ్రిక్‌లో ప్రతిబింబిస్తుంది. ఫాబ్రిక్ డిజైనర్లు ఫాబ్రిక్ నాణ్యతతో పాటు ఫాబ్రిక్‌పై డిజైన్‌ను సరైన అవగాహనతో పనిచేయాల్సి ఉంటుంది. ఫాబ్రిక్ ప్రింటింగ్, డైయింగ్, ఎంబ్రాయిడరింగ్, డిజైన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో.. ఫాబ్రిక్‌పై 3D ఆర్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఫాబ్రిక్ డిజైనర్లు వివిధ రకాల థ్రెడ్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు.
వ్యక్తిగత నైపుణ్యాలు 1. ఈ రంగంలో విజయం సాధించడానికి, అభ్యర్థి సృజనాత్మకంగా ఉండటం చాలా ముఖ్యం. ఫాబ్రిక్ డిజైనర్‌కి ప్రతి రోజు ప్రాజెక్ట్ కొత్త సవాలు, కాబట్టి దైజైనర్ ప్రతిసారీ భిన్నంగా ఆలోచించాలి.
2. కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే వివిధ రకాల ప్యాటర్న్‌ల గురించి తెలుసుకోవడం అవసరం. మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే, కొత్త , విభిన్నమైన ప్యాటర్న్‌లను రూపొందించడంతోపాటు, ఫ్యాబ్రిక్‌పై ఫ్యూజన్ ఆర్ట్‌ను ఉపయోగించడం రావాలి.
3. ఈ రంగంలో విజయం కోసం కస్టమర్స్ అవసరాన్ని, ఆసక్తిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ డిజైన్‌లు హిట్ అయితే.. అధిక ధరలను పొందవచ్చు. మీ డిజైన్ హిట్ అయితే, మీ కెరీర్ సెట్ అవుతుంది.
4. ఫ్యాబ్రిక్‌తో కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలంటే దేశ విదేశాల్లో జరుగుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి.
5. ఫ్యాషన్ మార్కెట్‌పై దృష్టి పెట్టడమే కాకుండా, రంగు, దారం, వివిధ రకాల ఫాబ్రిక్‌లపై అవగాహన అవసరం.
కోర్సుకు అర్హత: మీరు ఫాబ్రిక్ డిజైనర్ కావాలనుకుంటే, మీరు టెక్స్‌టైల్ సంబంధిత కోర్సు చేయాలి. కోర్సులో ప్రవేశం పొందాలంటే, అభ్యర్థి తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కోర్సు చేయాలనుకుంటే ముందుగా టెక్స్‌టైల్ లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ డిగ్రీ కోర్సు చేయాలి. ప్రస్తుతం చాలా ఇన్‌స్టిట్యూట్‌లు టెక్స్‌టైల్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా, కోర్సులో అడ్మిషన్ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకోబడుతుంది. అయితే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో స్వల్ప తేడా ఉన్నాయి.
టాప్ కోర్సులు టెక్స్‌టైల్ అండ్ ఫ్యాషన్ డిజైన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా టెక్స్‌టైల్ డిజైన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా టెక్స్‌టైల్ డిజైన్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా టెక్స్‌టైల్ డిజైనింగ్‌లో డిప్లొమా ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్ డిజైన్‌లో డిప్లొమా టెక్స్‌టైల్ డిజైనింగ్‌లో అడ్వాన్స్ డిప్లొమా టెక్స్‌టైల్ డిజైన్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్ డిప్లొమా ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఫ్యాబ్రిక్ డిజైన్‌లో బీఎస్సీ ఫ్యాబ్రిక్ డిజైనింగ్‌లో మాస్టర్
కెరీర్ అవకాశం: ఈ రంగంలో అనేక కెరీర్ అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు ఫ్యాషన్ పరిశ్రమలో గొప్ప కెరీర్ చేయవచ్చు. విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాబ్రిక్ డిజైనర్‌కు ఉద్యోగాల కొరత ఉండదు. దుస్తుల తయారీ కంపెనీల నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఏజెన్సీలు, ఎగుమతి గృహాలు , రిటైల్ కేంద్రాల వరకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కోర్సు చేసిన తర్వాత, అభ్యర్థులు టెక్స్‌టైల్ ల్యాబ్ మేనేజర్, ఫ్యాబ్రిక్ లేదా టెక్స్‌టైల్ డిజైనర్, ఫ్యాబ్రిక్ రిసోర్స్ మేనేజర్, ప్రింటింగ్ అండ్ డైయింగ్ కన్సల్టెంట్, ఎంబ్రాయిడరీ డిజైనర్ వంటి పోస్టులలో పని చేయవచ్చు. ఈ ఫీల్డ్‌లో ఫ్రీలాన్సర్‌గా పని చేయవచ్చు. కొన్ని రోజుల శిక్షణ తర్వాత, మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. చాలా మంది బోటిక్‌లు, గార్మెంట్ ఫ్యాక్టరీలు వంటిని ఏర్పాటు చేసుకుని చాలా సంపాదిస్తున్నారు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు.
ఫాబ్రిక్ డిజైనర్ ఆదాయం: క్వాలిఫైడ్ ఫాబ్రిక్ డిజైనర్‌కి మంచి జీతం లభిస్తుంది. కెరీర్ ప్రారంభంలో నెలకు 25 నుంచి 30 వేల రూపాయలు సులభంగా అందుకుంటున్నారు. అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యక్తులు మీ పనిని ఇష్టపడితే, మీరు కోరిన ధరను పొందవచ్చు.
జాబ్ మార్కెట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం.. సగటున ఎంట్రీ లెవల్ ఫ్యాబ్రిక్ డిజైనర్‌కు రూ. 6 లక్షలు, సీనియర్ డిజైనర్‌కి 9 లక్షలు .. లీడ్ డిజైనర్‌కి రూ. 15 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తుంది. ఈ రంగంలో ఫ్రీలాన్సర్లు ఆదాయం వారు పొందే ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉంటుంది.
టాప్ ఇన్స్టిట్యూట్స్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ స్టడీస్, న్యూఢిల్లీ పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ అపీజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, న్యూఢిల్లీ ఆర్చ్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ ఆర్ట్ డిజైన్, జైపూర్ మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, ఉదయపూర్ సోఫియా BK సోమాని పాలిటెక్నిక్, ముంబై మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, ఉదయపూర్ సోఫియా BK సోమాని పాలిటెక్నిక్, ముంబై
మరిన్ని కెరీర్ కు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..