JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022 సెషన్ -1 అడ్మిట్ కార్డులు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
జేఈఈ మెయిన్ (JEE Main 2022) మొదటి సెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మంగళవారం (జూన్ 21) ఎన్టీఏ విడుదల చేసింది..
JEE Main 2022 Admit Card Download: జేఈఈ మెయిన్ (JEE Main 2022) మొదటి సెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మంగళవారం (జూన్ 21) ఎన్టీఏ విడుదల చేసింది. కేవలం రెండు రోజుల్లో (జూన్ 23 నుంచి) పరీక్షలు ప్రారంభం కానుండగా.. అడ్మిట్ కార్డులు విడుదలవ్వకపోవడంతో అభ్యర్ధుల్లో నెలకొన్న ఆందోళనకు ఎట్టకేలకు చెక్ పడినట్లయ్యింది. జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి.. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో జూన్ 23, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా 501 నగరాలతో పాటు ఇతర దేశాల్లోని 21సిటీల్లో జేఈఈ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షలకు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు రాయనుండగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు లక్షన్నర మంది రాస్తున్నారు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 011 – 40759000 నంబర్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
కాగా ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్ జూన్ 2022, జేఈఈ మెయిన్ జులై 2022లుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండో సెషన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జులై సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరుగుతాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.