AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: అసలు పార్టీ మాదే.. 34 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు లేఖ..

Maharashtra Political Crisis: ఏక్‌నాథ్‌షిండేను తమ నేతగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్దవ్‌ వర్గానికి విప్‌ జారీ చేసే అధికారం లేదంటూ ట్వీట్‌ చేశారు శివసేన రెబల్‌ నేత..

Maharashtra Political Crisis: అసలు పార్టీ మాదే.. 34 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు లేఖ..
Eknath Shinde
Sanjay Kasula
|

Updated on: Jun 22, 2022 | 4:43 PM

Share

మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఏక్‌నాథ్‌షిండేను(Eknath Shinde) తమ నేతగా ఎన్నుకున్నారు రెబల్‌ శివసేన ఎమ్మెల్యేలు. గవర్నర్‌కు 34 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఏక్‌నాథ్‌షిండేను తమ నేతగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్దవ్‌ వర్గానికి విప్‌ జారీ చేసే అధికారం లేదంటూ ట్వీట్‌ చేశారు శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌షిండే. ఉద్దవ్‌ నివాసంలో జరిగే ఎమ్మెల్యేల భేటీ రాజ్యాంగ విరుద్దమన్నారు. శివసేన చీఫ్‌ విప్‌ను మార్చిన ఏక్‌నాథ్‌షిండే..చీఫ్‌విప్‌గా భారత్‌ గోగ్‌వాలేను నియమించారు. తన తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తముందన్న వార్తల్లో నిజం లేదన్నారు శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌షిండే. ఇప్పటివరకు తాను బీజేపీ నేతలతో చర్చలు జరపలేదన్నారు. తామే నిజమైన శివసైనికులమన్నారు ఏక్‌నాథ్‌ షిండే.

మరోవైపు కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలతో భేటీ అవుతున్నారు సీఎం ఉద్దవ్‌థాక్రే. తన నివాసంలో జరిగే భేటీకి అందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. సాయంత్రం 5గంటల వరకు ఎమ్మెల్యేల కోసం వేచిచూడాలని శివసేన హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. ఉదయం కేబినెట్‌ సమావేశానికి 8 మంది శివసేన మంత్రులు హాజరుకాలేదు..

అయితే ఏక్‌నాథ్‌ షిండే క్యాంప్‌కు ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ హ్యాండివ్వడం కూడా సంచలనం రేపింది. తనను కిడ్నాప్‌ చేసి బలవంతంగా సూరత్‌ తీసుకెళ్లారని ఆరోపించారు నితిన్‌ దేశ్‌ముఖ్‌. గుండెపోటు వచ్చినట్టు నాటకమాడి షిండే క్యాంప్‌ నుంచి తాను బయటకు వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికి కూడా తన మద్దతు ఉద్దవ్‌థాక్రేకు ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు సూరత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి 44మంది ఎమ్మెల్యేల్లో 41మంది హాజరయ్యారు. రెబల్‌ ఎమ్మెల్యేలపై శివసేన అధినేత ధైర్యంగా ఉన్నారన్నారు AICC అబ్జర్వర్‌ కమల్‌నాథ్‌.. వారంతా తిరిగొస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో శివసేన నేతలు ఆందోళనలను ఉధృతం చేశారు.మహా వికాస్‌ అఘాడి సర్కారను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని శివసేన నేతలు మండిపడుతున్నారు. ఔరంగాబాద్‌లో శివసేన కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ఉద్దవ్‌థాక్రేను ఏక్‌నాథ్‌షిండే మోసం చేశారని శివసేన కార్యకర్తలు కన్నీరుమున్నీరయ్యారు.

సర్కారును నిలబెట్టుకునేందుకు సీఎం ఉద్ధవ్ ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మాజీ సీఎం ఫడ్నవీస్ పావులు కదుపుతున్నారు . శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతు కోసం షిండేతో ఫడ్నవీస్ చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కోసం కూడా ఫడ్నవీస్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అటు.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ కరోనా బారిన పడ్డారు. ఆయన క్వారెంటైన్‌లో ఉండాల్సి రావడం మహారాష్ట్ర తాజా రాజకీయాలపై ప్రభావం చూపబోతోంది. షిండే-గవర్నర్ భేటీకి చాన్స్ లేకపోవడంతో అక్కడి పొలిటికల్ సీన్ మళ్లీ ఆసక్తికరంగా మారింది.

జాతీయ వార్తల కోసం