Rajasthan: ఇంకా ఏ కాలంలో ఉన్నారో.. చేతబడి చేస్తోందని మహిళ నాలుక కోసేందుకు ప్రయత్నించారు.. అంతే కాకుండా
శాస్త్రసాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా మారుమూల పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి. చేతబడి చేయడం, మంత్రాలు వేయడం వంటి మూఢ నమ్మకాలు ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. మంత్రాలు...
శాస్త్రసాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా మారుమూల పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి. చేతబడి చేయడం, మంత్రాలు వేయడం వంటి మూఢ నమ్మకాలు ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. మంత్రాలు చేస్తోందన్న ఆరోపణలతో దాడులకు పాల్పడిన ఘటనలూ మనం వింటూనే ఉన్నాం. ఇప్పటికీ ప్రజలు మూఢనమ్మకాలతో సహజీవనం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజస్థాన్(Rajasthan) లో ఇలాంటి ఘటనే జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న మహిళ.. చేతబడి చేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు దారుణ చర్యకు పాల్పడ్డారు. ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా మహిళ నాలుక కోసేందుకు యత్నించారు. బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లోని అజ్మీర్(Ajmir) నౌచాన్ గ్రామానికి చెందిన ఓ మహిళ నివాసముంటోంది. గుడిసెలో ఒంటరిగా ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు.. ఆమె చేతబడి చేస్తోందని, మంత్రాలు వేస్తోందని వేధించేవారు. ఈ క్రమంలోనే మహిళ వంట చేసుకుంటున్న సమంయోల గుడిసెపై పెట్రల్పోసి నిప్పంటించారు. దీనిని గమనించిన బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని బయటకు వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు మహిళపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమె నాలుక కోసేందుకు ప్రయత్నించారు. పెనుగులాటలో బాధిత మహిళ పన్ను ఊడిపోయింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్థులు ఇక్కడ ఉంటే చంపేస్తామని, తక్షణమే ఊరిని విడిచి వెళ్లిపోవాలని బెదిరించారు. అయితే అదే గ్రామంలో బాధితురాలి బంధువులు ఉన్నా వారు కూడా నిందితుల పక్షానే నిలబడడం గమనార్హం. వారి బారి నుంచి తప్పించుకున్న మహిళ.. మాజీ సర్పంచ్సాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టరు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి