AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పరీక్షల్లో ఫెయిల్.. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకిన స్టూడెంట్.. చివరికి ఏం జరిగిందంటే

విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాల్సిన పరీక్షలు వారి ప్రాణాలు తీస్తున్నాయి. పాస్ అవలేదనో, అనుకున్న మార్కులు రాలేదనో, మంచి ర్యాంక్ సాధించలేదనో.. ఇలా చిన్నచిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలో పాస్...

Andhra Pradesh: పరీక్షల్లో ఫెయిల్.. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకిన స్టూడెంట్.. చివరికి ఏం జరిగిందంటే
Crime
Ganesh Mudavath
|

Updated on: Jun 22, 2022 | 3:08 PM

Share

విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాల్సిన పరీక్షలు వారి ప్రాణాలు తీస్తున్నాయి. పాస్ అవలేదనో, అనుకున్న మార్కులు రాలేదనో, మంచి ర్యాంక్ సాధించలేదనో.. ఇలా చిన్నచిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలో పాస్ కాకపోతే ఇక అన్నీ కోల్పోయామంటూ జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లా(Krishna District) మచిలీపట్నంలో(Machilipatnam) ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురై.. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చికిత్స కోసం విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత విద్యార్ధుల ఆవేదన అర్ధం చేసుకోదగినదే. కాదనడం లేదు. అలాగని చదువు మాత్రమే జీవితం కాదు.. అది జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నది సామాజివ వేత్తలు చెబుతున్నారు. ధీరూభాయ్ అంబానీ నుంచి అదానీ వరకూ ఫెయిలైన వాళ్లే. అయినా వాళ్లు జీవితంలో ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ఆ వాస్తవాన్ని గుర్తెరిగి ముందుకు సాగాలే గానీ, ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

కాగా.. ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్‌ అయ్యారు. ఫస్ట్‌ ఇయర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 65 శాతం పాస్‌ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణ జిల్లా 72 శాతం, స్వల్పంగా కడపలో 55 శాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి