AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణపయ్యకు దండం పెట్టి గొప్పపనే చేశాడు.. దొంగతనంలో ఇదో స్టైల్‌..! వైరలవుతున్న వీడియో

కాయకష్టం చేయటానికి బద్దకించిన ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడపడ్డాడు. ఇళ్లలోకి వెలితే ఎవరైనా పట్టుకొని బడిత పూజ చేస్తారని అనుకున్నాడేమో...గానీ, తను చోరీ చేయటానికి ఓ గుడిని ఎంచుకున్నాడు. భోజనాల్లో ఇష్టం లేని ఆహారం పక్కన పెట్టేసినట్లు

గణపయ్యకు దండం పెట్టి గొప్పపనే చేశాడు.. దొంగతనంలో ఇదో స్టైల్‌..! వైరలవుతున్న వీడియో
Robbery
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2022 | 5:04 PM

Share

కాయకష్టం చేయటానికి బద్దకించిన ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడపడ్డాడు. ఇళ్లలోకి వెలితే ఎవరైనా పట్టుకొని బడిత పూజ చేస్తారని అనుకున్నాడేమో…గానీ, తను చోరీ చేయటానికి ఓ గుడిని ఎంచుకున్నాడు. భోజనాల్లో ఇష్టం లేని ఆహారం పక్కన పెట్టేసినట్లు హుండీలో చిల్లర వదిలి నోట్లను మాత్రం ఎరుకున్నాడు..అయితే, సదరు దొంగోడు చేసిన చోరీ సీన్‌ మొత్తం ఆ గుడిలోని సి.సి కెమారాలో రికార్డైంది.. అయితే, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్‌ సీన్‌ ఒకటి కనిపించింది. అదేంటంటే…దొంగ ఎంత ఘటికుడైనా దేవుడంటే భయపడ్డాడు. పాపభీతి వెంటాడిందో, లేదంటే దైవభక్తి గలవాడో తెలియదు కానీ, చోరీ తర్వాత తప్పులు క్షమించమంటూ ఆ దేవుడికి దణ్ణం పెట్టాడు చోరుడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలోని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో జరిగింది.

భీమడోలు- ద్వారకాతిరుమల ప్రధాన రహదారి పక్కన తిమ్మాపురం సమీపంలో విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది. అయితే ఓ దొంగ అర్థరాత్రి సమయంలో గునపంతో గుడి తలుపులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించాడు. హుండీని తెరిచి అందులో ఉన్న నగదును ఎంచక్కా కింద కూర్చుని లెక్కపెట్టుకున్నాడు. నోట్లు మాత్రం తను తీసుకుని చిల్లర డబ్బులు తిరిగి దేవుడికే వేసేశాడు. అంతేకాదు వెళ్ళిపోయే ముందు తన పాపాలను పోగొట్టు దేవుడా అనేది విధంగా స్వామికి నమస్కరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సీన్ మొత్తం ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి