Watch Video: మీరు చూసింది నిజమే.. సింగిల్‌గా.. సింపుల్‌గా నడిచివెళ్తోన్న కోహ్లీ.. నెట్టింట వీడియో వైరల్..
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు లీసెస్టర్‌షైర్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చాలా పేలవంగా తయారైంది. తొలిరోజు టీమ్ ఇండియా కీలక బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరి నిరాశపరిచారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ఫీల్డ్‌లో తడబడుతున్నాడు. గత రెండేళ్లుగా సెంచరీ లేకుండా నిరాశపరుస్తున్నాడు. కానీ, లీసెస్టర్‌షైర్ ప్రజలకు షాకిస్తూ వీధుల్లో సింగిల్‌గా తిరిగేస్తూ, ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రిటన్‌లో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య విరాట్ కోహ్లీ లీసెస్టర్‌షైర్ మార్కెట్‌లో తిరుగుతూ కనిపించాడు. విరాట్ కోహ్లీ లీసెస్టర్‌షైర్ వీధుల్లో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ మాస్క్ ధరించలేదు. అతని చేతిలో ఓ బ్యాగ్ ఉంది. విరాట్ కోహ్లి షాపింగ్‌కి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లీకి కరోనా సోకిందని, ఇంగ్లాండ్‌లో కూడా ఇది జరిగే ప్రమాదం ఉందనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత BCCI కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. కానీ విరాట్ కోహ్లి మాత్రం వీటన్నింటిని పట్టించుకోకుండా తిరిగేస్తున్నాడు.
కరోనా కేసుల మధ్య అభిమానులను ఎక్కువగా కలవకూడదని టీమ్ ఇండియా ఆటగాళ్లతో మాట్లాడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని, లేదంటే భారత జట్టు మొత్తం ఇబ్బందులు పడుతుందని హెచ్చరిస్తామని అన్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇంగ్లండ్‌తో టెస్ట్ ఆడాలి. దానికి ముందు టీమ్ ఇండియాలోని ఏదైనా ముఖ్యమైన ఆటగాడు కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలితే, అది సిరీస్‌ను గెలుచుకోవాలనే ఆశను కూడా విచ్ఛిన్నం చేస్తుంది.
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమ్ ఇండియా బయో బబుల్‌లో లేదనే సంగతి తెలిసిందే. ఆటగాళ్లు బయట తిరిగేందుకు అనుమతిస్తారు. ప్లేయర్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ మాత్రమే కాకుండా రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్ళు కూడా ఇంగ్లండ్‌లో ప్రయాణించడాన్ని ఆనందిస్తున్నారు. అయితే ఈ చర్య టీమ్ ఇండియాకు భారీ నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే బ్రిటన్‌లో ప్రతిరోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
@imVkohli Spotted at Street Of Leicester, United Kingdom Yesterday ?? . . ?: travelexplorergirl #ViratKohli #Leicester pic.twitter.com/RrVp9Cg1Lo
— virat_kohli_18_club (@KohliSensation) June 24, 2022
వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ ఫ్లాప్..
లీసెస్టర్‌షైర్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో, కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. సెట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయాడు. కోహ్లి 69 బంతుల్లో క్రీజులో నిలిచి, 33 పరుగులు చేశాడు. అంపైర్ నిర్ణయం కాస్త వివాదాస్పదమైనప్పటికీ విరాట్ కోహ్లీ ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మొత్తానికి మరోసారి తను పెద్ద ఇన్నింగ్స్ ఆడకుండానే పెవిలియన్ చేరాడు.