Virat Kohli: అంపైర్ ఔట్ నిర్ణయంపై కోహ్లీ అసహనం.. క్రీజులోనే నిల్చుని ఇలా.. Viral Video

Leicestershire vs India: క్రీజులో పాతుకపొయిన విరాట్ కోహ్లీ, భారీ ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్లాన్ చేశాడు. కానీ, తన బ్యాడ్ ఫాంను గుర్తు చేస్తూ అంపైర్ భారీ షాక్ ఇచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కోహ్లీ ఏం చేశాడంటే..

Virat Kohli: అంపైర్ ఔట్ నిర్ణయంపై కోహ్లీ అసహనం.. క్రీజులోనే నిల్చుని ఇలా.. Viral Video
Leicestershire Vs India Virat Kohli Out Video
Follow us

|

Updated on: Jun 24, 2022 | 3:59 PM

లీసెస్టర్‌షైర్‌తో జరుగుతోన్న సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు తడబడిన సంగతి తెలిసిందే. తొలి రోజున భారత బ్యాట్స్‌మెన్స్ బ్యాటింగ్ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ మేరకు క్రీజులో పాతుకపోయి, సెట్ అయినట్లే కనిపించాడు. కానీ, ఇంతలో అంపైర్ రూపంలో మరోసారి తన బ్యాడ్ లక్ ఎదురైంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో 69 బంతులు ఆడిన విరాట్.. 33 పరుగులు సాధించాడు. ఫుల్-లెంగ్త్ బాల్‌కు ఫ్లిక్ చేయడానికి కోహ్లి లైన్ దాటి వెళ్లాడు. కానీ, అది మిస్ కావడంతో బౌలర్, ఫీల్డర్‌లు ఒకేసారి అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ తన వేలును పైకెత్తి, విరాట్‌ని ఔట్‌గా ప్రకటించాడు. అతను నిరాశతో వెనక్కి వెళ్ళే ముందు అంపైర్‌ వైపు గుర్రుగా చూసి, ఇది ఎలా ఔట్ అంటూ అడిగేశాడు. అలాగే, కోపంగానే కొద్దిసేపు అంపైర్‌తో మాట్లాడుతూ కనిపించాడు. అనంతరం నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో భారత్ 138/6తో ఉంది.

మొత్తంగా భారత్ 246 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక 21 పరుగుల వద్ద శుభ్‌మాన్ గిల్ పెవిలియన్ చేరగా, రోహిత్ 25, విహారి 3, కోహ్లీ 33, అయ్యర్ 0, జడేజా 13, శ్రీకర్ భరత్ 70 నాటౌట్, ఠాకూర్ 6, ఉమేష్ 23, షమీ 18 నాటౌట్‌గా నిలిచాడు.