Team India: పాకిస్తాన్‌కు చెక్ పెట్టనున్న టీమిండియా.. సరికొత్త రికార్డ్ దిశగా రోహిత్ సేన.. అదేంటంటే?
IND vs PAK: 2022లో టీమ్ ఇండియా ఇప్పటివరకు 11 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడింది. ముందున్న షెడ్యూల్ ప్రకారం భారత్ కనీసం 23 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంటే ఈ ఏడాది చివరి నాటికి భారత జట్టు 34 మ్యాచ్‌లు..
అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20 ప్రభావం నిరంతరం పెరుగుతోంది. ఒకవైపు ఐపీఎల్‌లో జట్లు, మ్యాచ్‌ల సంఖ్య పెరిగిపోతుంటే, మరోవైపు భారత జట్టు కూడా గతంలో కంటే ఈ ఫార్మాట్‌లో ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం ప్రారంభించింది. 2022లో, ఒక సంవత్సరంలో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ప్రపంచ రికార్డును భారత్ నెలకొల్పేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండగా.. ఈ ఏడాది చివరి నాటికి టీమిండియా బద్దలుకొట్టనుంది. 2022లో టీమ్ ఇండియా ఇప్పటివరకు 11 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడింది. ముందున్న షెడ్యూల్ ప్రకారం భారత్ కనీసం 23 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంటే ఈ ఏడాది చివరి నాటికి భారత జట్టు 34 మ్యాచ్‌లు ఆడి పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టనుంది. గతేడాది 29 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు సృష్టించింది.
దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌లు..
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌లు ఆడిన భారత్.. శ్రీలంక, వెస్టిండీస్‌తో తలో 2 మ్యాచ్‌లు ఆడింది. అలాగే జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో టీమిండియా 2 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. దీని తర్వాత జులైలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జులై నెలాఖరు నుంచి వెస్టిండీస్ పర్యటనలో భారత్ 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఆసియా కప్‌లో కనీసం 5 మ్యాచ్‌లు..
ఆగస్టు-సెప్టెంబర్‌లో శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది. 2018లో ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరిగింది. కానీ, ఈసారి T20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భారత జట్టు కనీసం 5 మ్యాచ్‌లు ఆడనుంది. ఒకవేళ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే మ్యాచ్‌ల సంఖ్య 6 అవుతుంది. అలాగే సెప్టెంబరులో ఆస్ట్రేలియా జట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడేందుకు భారత్‌ను సందర్శించనుంది. దీని తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్‌కు ఇరు జట్లు బయలుదేరుతాయి. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా నాకౌట్‌కు చేరుకోకపోయినా.. కనీసం 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
సెమీ-ఫైనల్‌కు చేరుకున్నప్పుడు, మ్యాచ్‌ల సంఖ్య 6, ఫైనల్‌కు చేరుకున్నప్పుడు, మ్యాచ్‌ల సంఖ్య 7కి పెరుగుతుంది. ఈ విధంగా, ప్రపంచ కప్ వరకు అన్ని మ్యాచ్‌లను జోడిస్తే, 2022 సంవత్సరంలో భారత్ కనీసం 34 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆసియా కప్, ప్రపంచ కప్ రెండింటిలోనూ ఆ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటే, అప్పుడు మ్యాచ్‌ల సంఖ్య 37 అవుతుంది.
అయితే, ప్రపంచకప్‌కు ముందు జింబాబ్వేలో జింబాబ్వేతో సిరీస్ ఆడేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఆ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు వెళ్లకపోయే అవకాశం ఉంది. ఈ సిరీస్ జరిగితే 2022లో భారత్‌కు టీ20 మ్యాచ్‌ల సంఖ్య మరింత పెరుగుతుంది.