AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sports: భారత్‌లో వృద్ధి చెందుతోన్న క్రీడా వ్యాపారం.. 2027 వరకు100 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా..

భారత్‌లో క్రీడా ప్రేమికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రీడల పట్ల ప్రజల్లో ఉన్న మక్కువ వల్ల క్రీడా వ్యాపారం కూడా పుంజుకుంటుంది. భారతదేశ క్రీడా మార్కెట్ కోట్లాది రూపాయలను ఆర్జించే పరిశ్రమగా మారింది...

Sports: భారత్‌లో వృద్ధి చెందుతోన్న క్రీడా వ్యాపారం.. 2027 వరకు100 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా..
IPL
Srinivas Chekkilla
|

Updated on: Jun 24, 2022 | 2:32 PM

Share

భారత్‌లో క్రీడా ప్రేమికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రీడల పట్ల ప్రజల్లో ఉన్న మక్కువ వల్ల క్రీడా వ్యాపారం కూడా పుంజుకుంటుంది. భారతదేశ క్రీడా మార్కెట్ కోట్లాది రూపాయలను ఆర్జించే పరిశ్రమగా మారింది. బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నివేదిక ప్రకారం భారతదేశ క్రీడా రంగం వ్యాపారం రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 5 రెట్లు వృద్ధి చెందుతుందని, 2027 సంవత్సరంలో $100 బిలియన్లకు చేరుకుంటుందని.. ఇది 2020 సంవత్సరంలో $27 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. స్పోర్ట్స్ బిజినెస్‌లో మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన మీడియా హక్కులు, క్రీడలకు సంబంధించిన డ్రస్సేజ్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, స్పోర్ట్స్‌లో ఉపయోగించే వస్తువులు, ఇతర అంశాలు ఉంటాయి. క్రీడా వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పెద్ద పాత్ర పోషిస్తోందని నివేదికలో పేర్కొంది. ఐపీఎల్‌ని చూసే వారి సంఖ్య కోట్లలో ఉంది, ఇది వాణిజ్యపరంగా బాగా ఉపయోగించబడింది.

లీగ్ మీడియా హక్కుల వేలం నుండి IPL ప్రజాదరణ, ఆదాయాలను అంచనా వేయవచ్చు. 2023, 2027 మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార మీడియా హక్కులు రూ. 48,390 కోట్లకు (6.2 బిలియన్ డాలర్లు) అమ్ముడయ్యాయి. IPL ఒక మ్యాచ్‌కు అయ్యే ఖర్చు పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్‌గా మారింది. ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ ధర గతంతో పోలిస్తే 100 శాతం పెరిగింది. గతసారి ఒక్కో మ్యాచ్ విలువ రూ.54.5 కోట్లు. ఇప్పుడు ఒక్కో మ్యాచ్ ఖరీదు రూ.114 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి IPL మ్యాచ్ విలువ $14.61 మిలియన్లు, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాత రెండోది. ఒక్కో NFL మ్యాచ్ విలువ $17 మిలియన్లు. IPL మాజీ ఛైర్మన్, లీగ్ రూపశిల్పిగా పరిగణించబడుతున్న లలిత్ మోడీ, IPL ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్‌గా అవతరించనుందని ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. వచ్చే సైకిల్ అంటే వచ్చే వేలంలో ఐపీఎల్ మీడియా హక్కుల విలువ మళ్లీ రెట్టింపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రోకరేజ్ సంస్థ నివేదిక ప్రకారం భారతీయ క్రీడల మీడియా మార్కెట్ 2020 సంవత్సరంలో కేవలం ఒక బిలియన్ డాలర్ల నుంచి 2027 నాటికి 13.4 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. అదే సమయంలో ప్రపంచ మీడియా హక్కుల మార్కెట్ విలువ 52.1 బిలియన్ డాలర్లు. ఇందులో క్రికెట్ వాటా 2.7 శాతం నుంచి 3 శాతానికి పెరిగింది. మీడియా హక్కుల విషయంలో ఫుట్ బాల్ ప్రస్థానం చెక్కుచెదరలేదు. దీని వాటా 42 శాతం. క్రీడా వస్తువులు, పరికరాల తయారీలో చైనా, జపాన్ తర్వాత ఆసియాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతదేశంలో క్రీడా వస్తువుల మార్కెట్ 2020 సంవత్సరంలో $ 4.5 బిలియన్లుగా ఉంది. ఇది 2027 నాటికి $ 6.6 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. దేశంలో క్రీడా పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోందని నివేదికలో పేర్కొన్నారు. అయినప్పటికీ, మౌలిక సదుపాయాల కొరత, క్రీడా వస్తువులు, ఈవెంట్‌లపై అధిక పన్నులు మరియు ఆర్థిక నిర్వహణ, పాలనా లోపం వంటి సవాళ్లు అలాగే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..