AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Brezza: మారుతి నుంచి తొలి సన్‌రూఫ్ SUV.. న్యూ ఫీచర్స్ అదుర్స్.. ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం..

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి తన SUV బ్రెజ్జాను కొత్త లుక్‌తో త్వరలో విడుదల చేయబోతోంది. మారుతి నుంచి సన్‌రూఫ్‌తో వస్తున్న..

Maruti Suzuki Brezza: మారుతి నుంచి తొలి సన్‌రూఫ్ SUV.. న్యూ ఫీచర్స్ అదుర్స్.. ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం..
Maruti
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2022 | 1:52 PM

Share

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి తన SUV బ్రెజ్జాను కొత్త లుక్‌తో త్వరలో విడుదల చేయబోతోంది. మారుతి నుంచి సన్‌రూఫ్‌తో వస్తున్న తొలి SUV కారు ఇది అవుతుంది. అలాగే, బ్రెజ్జా ఇంటీరియర్ లుక్ కూడా మార్చేశారు. చాలా డిఫరెంట్‌ లుక్‌లో ఉంది. తాజాగా కొత్త బ్రెజ్జా కు సంబంధించిన రెండు ఫోటోలను మారుతి సుజుకి విడుదల చేసింది. దాని ఇంటీరియర్, డిజైన్ గురించి కొన్ని విశేషాలను వెల్లడించింది. మరి ఈ న్యూ బ్రెజ్జా ఫీచర్స్, స్టైల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.. మారుతి సుజుకి బ్రెజ్జా న్యూ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయబోతుండగా.. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 11 వేల రూపాయలతో ఈ SUV ని బుక్ చేసుకోవచ్చు.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అద్భుతం.. కొత్త మారుతి బ్రెజ్జా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్మార్ట్, ప్రో ప్లస్‌గా ఉండబోతోంది. ఇందులో డేట్ అండ్ టైమ్‌ తో పాటు సగటు వేగం, డ్రైవింగ్ టైమ్ గురించిన సమాచారం కూడా ఇవ్వబడుతుంది. కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడంలోనూ ప్రత్యేక సిస్టమ్ కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌.. మారుతి కొత్త SUV బ్రెజ్జాలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. మారుతి కార్లలో ఇదే తొలి సన్‌రూఫ్ కావడం విశేషం. అలాగే, స్పీడ్ ట్రాన్స్‌మిషన్, హైబ్రిడ్ ఇంజన్ మొదలైనవి కూడా ఉండనున్నాయి.

సెక్యూరిటీ ఫీచర్స్ అప్‌డేట్ చేశారు.. కొత్త బ్రెజ్జా సెక్యూరిటీ ఫీచర్లు కూడా అప్‌డేట్ చేశారు. వినియోగదారుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

మరికొన్ని ఫీచర్లు కూడా.. కొత్త బ్రెజ్జా కారులో ఫ్రెష్ ఎక్ట్సీరియర్ కనిపిస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ K15C డ్యూయల్ జెట్ ఇంజన్ పొందుతుంది.

ధర రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు.. కొత్త బ్రెజ్జా ధర విటారా బ్రెజ్జా కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, కొత్త బ్రెజ్జా ధర కూడా రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండబోతోందని పలు నివేదికలు చెబుతున్నాయి.

మీనాకూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనాకూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం