New Labour Laws: జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌ అమలు.. పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ పెరిగే అవకాశం..

జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ను అమలు చేసే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, జీతాల నిర్మాణం, పని పరిస్థితులు, వీక్-ఆఫ్‌లలో ప్రభుత్వం భారీ మార్పులు చేస్తోంది...

New Labour Laws: జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌ అమలు.. పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ పెరిగే అవకాశం..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 24, 2022 | 2:41 PM

జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ను అమలు చేసే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, జీతాల నిర్మాణం, పని పరిస్థితులు, వీక్-ఆఫ్‌లలో ప్రభుత్వం భారీ మార్పులు చేస్తోంది. కొత్త లేబర్ కోడ్ 4-రోజుల పని వారానికి ఒక నిబంధనను తీసుకొచ్చింది. ఏ ఉద్యోగి వారానికి 48 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు, అంటే రోజుకు 12 గంటలు పనిచేసే వారికి మూడు రోజులు సెలవులు ఉంటాయి. అంటే వారు ప్రతి నెలా 16 రోజులు మాత్రమే పని చేస్తారు. కేంద్ర కార్మిక చట్టంలోని 44 సెక్షన్లను విలీనం చేసిన తర్వాత నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు రూపొందించారు. ఈ లేబర్ కోడ్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత రంగాల కార్మికులను ఆరోగ్య బీమా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. ఈ ఉద్యోగులు ESIC కవర్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగులందరి జీతాల స్వరూపం మార్చుతారు. ప్రాథమిక జీతం మొత్తం జీతంలో 50 శాతం అవుతుంది. ఇది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌ను పెంచుతుంది. టేక్ హోమ్ జీతం తగ్గుతుంది.

కొత్త లేబర్‌ కోడ్‌ అమసలు తర్వాత, కార్మిక శక్తి 180 రోజుల పని తర్వాత సెలవులకు అర్హులు. అంతకుముందు కాల వ్యవధి 240 రోజులు. రోజుకు 10 గంటలు పనిచేసే వారికి రెండు వారాల సెలవులు ఉంటాయి. రోజుకు 8 గంటలు పని చేసే వారికి ఒక వారం సెలవు ఉంటుంది. ఏ కార్మికుడు వారానికి 48 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. కొత్త లేబర్ కోడ్ కంపెనీలకు కార్మికులను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఉద్యోగులను విడిచిపెట్టమని అడిగే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ఉద్యోగులకు పాన్-ఇండియా కనీస వేతనం కోసం కూడా నిబంధన ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..