PPF vs NPS: పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెటర్‌.. ఎందులో రాబడి ఎక్కువ ఉంటుంది..?

పొదుపు పథకాల్లో పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ ప్రజాధారణ పొందాయి. స్వచ్ఛదంగా నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఎన్‌పీఎస్‌ను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలెటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ(PFRDA) నిర్వహిస్తోంది...

PPF vs NPS: పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెటర్‌.. ఎందులో రాబడి ఎక్కువ ఉంటుంది..?
PPF Vs NPs
Follow us

|

Updated on: Jun 23, 2022 | 11:14 AM

పొదుపు పథకాల్లో పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ ప్రజాధారణ పొందాయి. స్వచ్ఛదంగా నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఎన్‌పీఎస్‌ను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలెటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ(PFRDA) నిర్వహిస్తోంది. ఎన్‌పీఎస్‌ను పార్లమెంటరీ చట్టం ద్వారా తీసుకొచ్చారు. అయితే చాలా మందికి పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌లో ఎందులో పెట్టబడి పెట్టాలో కన్ఫ్యూజన్‌ ఉంటుంది. పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండు పథకాలు మంచివని చెబుతున్నారు. ఇవి రిటైర్మెంట్‌ వరకు మంచి కార్పస్‌ సృష్టిస్తాయని పేర్కొంటున్నారు. రిస్క్‌ తీసుకునేవారికి పీపీఎఫ్‌ కంటే ఎన్‌పీఎస్‌లో రాబడి ఎక్కువ ఉంటుంది. సెబీ రిజిస్ట్రర్డ్‌ ట్యాక్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌ మణికరణ్‌ సింఘాల్‌ మాట్లాడుతూ “పీపీఎఫ్, ఎన్‌పీఎస్‌ రెండూ స్వచ్ఛదంగా పెట్టుబడి పెట్టే పథకాలు. అయితే వీటిలో దేన్ని ఎంచుకోవాలో గందరగోళంలో ఉంటారు. వీటిలో దేనికి ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుందో తెలియదు. అయితే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 80C ప్రకారం పీపీఎఫ్‌లో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుంది” అని అన్నారు.

“ఎన్‌పీఎస్‌లో ఎమిమిది మంది ఫండ్‌ మేనేజర్లు ఉంటారు. పెట్టుబడిదారులు ఇందులో ఒకరిని ఎంపిక చేసుకుని తన పెట్టుడిలో 60 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు. రిటైర్మెంట్‌ టైమ్‌లో మెచ్యూరిటీ అమౌంట్‌లో 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుంది. మిగిలిన 40 శాతం పెన్షన్‌ కోసం ఉంచుకోవాలి. అయితే దీనికి ట్యాక్స్‌ విధిస్తారు.” మణికరణ్ చెప్పారు. “ఎన్‌పీఎస్‌ పెట్టుబడిలో రెండు ఎంపికలు ఉంటాయి. అవి యాక్టివ్‌ మోడ్, ఆటో మోడ్‌. యాక్టివ్‌ మోడ్‌లో వార్షిక ప్రతిపాదికన ఈక్విటీ నుంచి డెట్‌, డెట్‌ నుంచి ఈక్విటీకి మార్చుకోవచ్చు. ఆటో మోడ్‌లో 8 మంది ఫండ్‌ మేనేజర్లు ఉంటారు. వారు డెట్‌ నుంచి ఈక్విటీకి ఈక్విటీ నుంచి డెట్‌కు మారుస్తారు. అయితే ఎన్‌పీఎస్‌లో సెక్షన్‌ 80CCD ప్రకారం 50,000 వరకే ట్యాక్స్‌ మిహాయింపు ఉంటుంది” అని వివరించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు