CEO Elon Musk: బిలియన్ డాలర్లు నష్టపోతున్న టెస్లా.. కారణం డ్రాగన్ దేశమేనా..?
ఎలక్ట్రిక్-వాహన తయారీదారు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున జర్మనీ, టెక్సాస్‌లోని టెస్లా ఇంక్ కొత్త ప్లాంట్లు "బిలియన్ల డాలర్లు" కోల్పోతున్నాయని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ చెప్పారు...
ఎలక్ట్రిక్-వాహన తయారీదారు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున జర్మనీ, టెక్సాస్‌లోని టెస్లా ఇంక్ కొత్త ప్లాంట్లు “బిలియన్ల డాలర్లు” కోల్పోతున్నాయని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ చెప్పారు. మే31న అస్ట్రిన్‌లోని టెస్లా అఫీషియల్ రికగ్నైజ్‌డ్ క్లబ్ టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలోన్ మస్క్ ఈ విషయం చెప్పాడు. టెస్లా టెక్సాస్ ఫ్యాక్టరీ తన కొత్త 4680 బ్యాటరీల ఉత్పత్తిని పెంచడంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం ఎక్కువగా వినియోగించే సాంప్రదాయ 2170 బ్యాటరీలు చైనా పోర్ట్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో 4680 బ్యాటరీల తయారీలో సవాల్, చైనాలో ఇరుక్కోపోయిన బ్యాటరీల కారణంగా లాస్ వస్తున్నట్లు తెలిపారు.
చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహించే షాంఘైలో కూడా లాక్‌డైన్ ఉంది. ఈ ప్రభావం టెస్లా షాంఘై ఫ్యాక్టరీతో పాటు కాలిఫోర్నియా ప్లాంట్‌పై పడింది. టెస్లా కార్ల విడిభాగాలు కొన్ని చైనాలో తయారవుతాయి ఇక్కడ లాక్‌డౌన్ కారణంగా వాటిని చైనా నుంచి కాలిఫోర్నియా ప్లాంట్‌కు రవాణా చేయలేకపోతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సప్లయ్ చైన్ సమస్యల్ని ఎదుర్కొంటున్నామని. మేం ఇంకా ఆ సమస్య నుంచి బయట పడలేదని ఎలాన్ మస్క్ చెప్పారు. మస్క్ ఇటీవల 10 శాతం ఉద్యోగులను తొలగించారు. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురౌతోంది.