Loans: లోన్ రికవరీ ఏజెంట్స్ వేధిస్తున్నారా? అయితే, ఇలా చేయండి..
లోన్ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను బెదిరించిన సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఇన్‌స్టంట్ లోన్‌లు ఇచ్చే డిజిటల్ లెండింగ్ యాప్‌ల విషయంలో ఈ వేధింపులు మరీ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ రోజుల్లో అప్పు చేయకుండా జీవితం గడపడం చాలా కష్టంగా మారింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎప్పుడో ఒకప్పుడు అప్పు చేయకుండా ఉండలేని పరిస్థితి. అయితే, అప్పు తీసుకున్న తరువాత దానిని తీర్చడం కూడా కష్టం అయ్యే పరిస్థితులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని తప్పనిసరి కారణాలతో లోన్స్ తీర్చడం కష్టంగా మారుతుంది. ఉదాహరణకు 2018లో పర్సనల్ లోన్ తీసుకున్నవారు అప్పటి వరకు సక్రమంగానే EMI చెల్లిస్తూనే వచ్చారు. అయితే, ఏప్రిల్ 2021.. మహమ్మారి రెండవ వేవ్‌లో ఉద్యోగం పోయింది. దాంతో ఆదాయమూ పోయింది. ఇప్పుడు ఆదాయం లేనప్పుడు, ఎవరైనా వాయిదాలు ఎలా చెల్లించగలరు? దీంతో EMI కట్టలేక డీఫాల్ట్ అయిన పరిస్థితి చాలా మందికి ఉంది. ఈ పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ అటువంటి వారిని బెదిరించడం ప్రారంభిస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. రికవరీ ఏజెంట్ మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, మీకు చట్టపరంగా ఉన్న ఆప్షన్స్ ఏమిటి? వాటి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
లోన్ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను బెదిరించిన సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఇన్‌స్టంట్ లోన్‌లు ఇచ్చే డిజిటల్ లెండింగ్ యాప్‌ల విషయంలో ఈ వేధింపులు మరీ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి. డబ్బుల రికవరీ కోసం ఈ కంపెనీలు ఎన్నో అనైతిక పద్దతులు ఉపయోగిస్తున్నాయి. లోన్ రికవరీ కోసం కస్టమర్లను బలవంతం చేస్తారు. దీన్ని నిరోధించేందుకు రిజర్వ్ బ్యాంక్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.
బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, రుణాల రికవరీ ఏజెంట్లు రుణాల రికవరీ కోసం బెదిరింపులు లేదా వేధింపులను చేయకూడదు. అది మౌఖిక లేదా భౌతికం ఏదైనా కావచ్చు. రుణగ్రహీతకు పదేపదే కాల్‌లు చేయకూడదు. ఉదయం 9 గంటలలోపు అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత కాల్ చేయడం కూడా వేధింపులుగానే పరిగణించాలి. లోన్ రికవరీ కోసం భౌతిక దాడులకు దిగడం లేదా బెదిరించడం అనేది వేధింపుల పరిధిలోకి వస్తుంది. అంతే కాదు, రుణం తీసుకున్నవారు వ్యక్తి ఇంటికి లేదా కార్యాలయంలో తెలియజేయకుండా బంధువులు, స్నేహితులు లేదా తోటి ఉద్యోగులను బెదిరించడం అదేవిధంగా వారిని వేధించడం కూడా వేధింపులు గానే పరిగణిస్తారు. బెదిరింపులు లేదా దుర్భాషల వాడకం కూడా దాని పరిధిలోకి వస్తుంది. ఈ RBI మార్గదర్శకం, నియంత్రిత సంస్థలకు అంటే అన్ని రకాల బ్యాంకులు (చెల్లింపు బ్యాంకులు మినహా) అలాగే NBFC కంపెనీలకు వర్తిస్తుంది.
లోన్ రికవరీ ఏజెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మొదటగా బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ బన్సాల్ చెప్పారు. అలాగే లోన్ చెల్లింపు నిబంధనలను కూడా చెప్పండి. మీ పరిస్థితుల గురించి బ్యాంకుకు తెలియచేయడం ముఖ్యం. బ్యాంక్‌లో చేసిన ఫిర్యాదును 30 రోజులలోపు పరిష్కరించకపోతే, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్‌లని నిర్దేశించవచ్చు. అలాగే ప్రత్యేక సందర్భాలలో జరిమానా కూడా విధించవచ్చు.
రికవరీ ఏజెంట్ ఏదైనా చట్టవిరుద్ధమైన చర్య తీసుకున్నా, దాడి చేసినా లేదా ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకున్నా, రుణగ్రహీత పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని బన్సాల్ వివరించారు. ఎవరైనా రికవరీ ఏజెంట్ ఎక్కువగా వేధిస్తే, న్యాయవాది రికవరీ ఏజెంట్‌ను సంప్రదించడం ద్వారా, అతని ద్వారా అతిగా జరిగిన తప్పులపై లేదా ఏదైనా తప్పుడు చర్య తీసుకోవడం వంటి వాటిపై కోర్టుకు వెళ్ళవచ్చు. అదే విధంగా లోన్ తీసుకున్న వ్యక్తి రికవరీ ఏజెంట్ విషయంలో అతిగా ప్రవర్తిస్తే అతను కూడా కోర్టుకు వెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది.