Viral News: వీడు మాములోడు కాదు.. 12 మందితో పెళ్లి.. ఊహించని విధంగా పోలీసులకు చిక్కిన నిత్యపెళ్లి కొడుకు
12 మందిని పెళ్లి చేసుకున్న నిత్యపెళ్ళికొడుకు.. మరో మైనర్‌తో పెళ్లికి స్కెచ్ వేసి..పోలీసులకు చిక్కాడు.. పోలీసుల విచారణలో నిందితుడు 12మందిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది.
Viral News: ఒకరిని కాదు ఇద్దర్నికాదు ఏకంగా 12మంది అమ్మాయిలను ప్రేమించి..ఒకరికి తెలియకుండా ఒకర్ని పెళ్లి చేసుకున్న ప్రబుద్దుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పరిచయం అయిన ప్రతి అమ్మాయిదగ్గర బ్రహ్మచారిగా నటిస్తూ.. అమాయక బాలికలను ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరకు పాపం పండి.. ఓ మైనర్ బాలికను కిడ్నప్ చేసి.. పోలీసుల వలలో చిక్కాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
12మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. మైనర్ బాలికను కిడ్నప్ చేసిన మోసగాడిని పూర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుడిని శంషాద్ అలియాస్ మనోవర్‌గా గుర్తించారు. గత ఆరేళ్లుగా శంషాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ఇన్నాళ్లకు పోలీసులకు చిక్కాడు. శంషాద్ ను విచారిస్తున్న సమయంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి.
శంషాద్ కొచ్చాడమాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనార్కలి గ్రామంలో నివాసి. అంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్వార్ గ్రామంలో మైనర్‌ను కిడ్నాప్ చేసినందుకు 2015 డిసెంబర్‌లో పూర్నియా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కిడ్నాప్ జరిగిన వారం తర్వాత.. కిషన్‌గంజ్ లో కిడ్నాప్ అయిన మైనర్ బాలికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు శంషాద్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
శంషాద్‌ను పట్టుకునేందుకు గత ఆరేళ్లుగా నిరంతరం పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మైనర్ బాలిక ను కిడ్నప్ చేసిన ఆరోపణల్లో బహదూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయిడంగి గ్రామంలో పోలీసులు శంషాద్‌ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు 12మందిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది.
శంషాద్ తమను ప్రేమ వలలో ఇరికించి పెళ్లి చేసుకున్నాడని అతడి ఏడుగురు భార్యలు పోలీసులకు తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకూ అతనికి అప్పటికే పెళ్లయిందని ఈ అమ్మాయిల్లో ఎవరికీ తెలియదు. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసిన పోలీసులు.. అనంతరం శంషాద్‌పై కిడ్నాప్, చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడిని జైలుకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..