AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UN Warning: ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన యూఎన్ చీఫ్.. లేదంటే ముప్పు తప్పదంటూ సీరియస్ వార్నింగ్..

UN Warning: ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడనుందా? ఆహారం దొరక్క జనాలు అవస్థలు పడుతారా? అంటే అవునని అంటోంది ఐక్యరాజ్య సమితి.

UN Warning: ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన యూఎన్ చీఫ్.. లేదంటే ముప్పు తప్పదంటూ సీరియస్ వార్నింగ్..
Un Chief
Shiva Prajapati
|

Updated on: Jun 26, 2022 | 9:10 AM

Share

UN Warning: ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడనుందా? ఆహారం దొరక్క జనాలు అవస్థలు పడుతారా? అంటే అవునని అంటోంది ఐక్యరాజ్య సమితి. సాదాసీదా మాటలతో కాదు.. ఏకంగా సీరియస్ వార్నింగే ఇచ్చింది. అవును.. ఇది మామూలు వార్నింగ్ కాదు. స్వయంగా ఐక్యరాజ్యసమితి టాప్ అఫీషియల్స్ ఇచ్చిన వార్నింగ్. ప్రజలకు కనీసం తిండికూడా దొరకని పరిస్థితి రాబోతోందని వార్నింగ్ ఇచ్చారు అధికారులు.

ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత రాబోతోందన్నారు యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌. ప్రపంచంలో పెరుగుతున్న ఆహారం కొరత కారణంగా మున్ముందు ప్రపంచ దేశాలు తీవ్ర విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బెర్లిన్‌లో జరిగిన సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే కోట్లాది మంది ప్రజలపై ఆర్ధిక పరమైన ప్రభావం పడిందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోందన్నారు. 2022లో మరిన్ని కరవు కాటకాలు సంభవించే అవకాశం ఉందని.. 2023 ఏడాది కూడా ఘోరంగా ఉండొచ్చని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పంటలు దెబ్బతింటాయన్నారు గుటెర్రస్‌. ఈ ఏడాది ఆహార లభ్యతలో ఏర్పడే సమస్యలు వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు దారితీయొచ్చన్నారు. ఇలాంటి విపత్తులతో సంభవించే సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదన్నారు. పేద దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని నిలబెట్టుకొనేలా, ప్రపంచ ఆహార మార్కెట్లను స్థిరీకరించేందుకు దోహదం చేసేలా ప్రైవేటు రంగానికి రుణ ఉపశమనం కలిగించాలని పిలుపునిచ్చారు. తమపై అనేక దేశాలు విధించిన ఆంక్షలే ఆహార కొరతకు కారణమంటూ రష్యా చేస్తున్న వాదనని కొట్టిపారేసింది జర్మనీ. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో రష్యా గోధుమలను ఎగుమతి చేసిందన్నారు.