Bihar: అన్నీ రెండు వేల నోట్ల కట్టలే.. పరిస్తే డబుల్ కాట్ పరుపంత.. ఆయన అవినీతికి అధికారులే షాక్
ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అప్పుడప్పుడూ అవినీతికి పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఓ అధికారి చేసిన అవినీతిని గురించి తెలిస్తే...
ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అప్పుడప్పుడూ అవినీతికి పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఓ అధికారి చేసిన అవినీతిని గురించి తెలిస్తే అవాక్కవడం పక్కా. ఎందుకంటే ఆయన అవినీతి కి పాల్పడి, పోగేసిన సొమ్మెంతో తెలిసి అధికారులే షాక్ అయ్యారు. ఎంతగా అంటే ఆ డబ్బంతా ఓ డబుల్ కాట్ పరుపునే ఆక్రమించేసేంతగా.. అంతే కాకుండా విలువైన పత్రాలనూ సీజ్ చేసుకున్నారు. బిహార్‌లోని(Bihar) పట్నాకు చెందిన డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్ అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో అతనిపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఆయన ఇంటితో (Vigilence Officers Raids) పాటు మరో నాలుగు చోట్ల ఒకే కాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తలిఖీల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూసి అధికారులు అవాక్కయ్యారు. బెడ్ పరుపు మొత్తం ఆక్రమించుకున్న రెండు వేల నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ మొత్తం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
#WATCH | Patna, Bihar: A team of surveillance department raided the residence of Drug Inspector Jitendra Kumar in the disproportionate assets case. A huge amount of cash, many land papers, gold, silver and four luxury cars were recovered: Surendra Kumar Maur, DSP Monitoring Dept pic.twitter.com/sukTl70OXs
ఇవి కూడా చదవండి— ANI (@ANI) June 25, 2022
ఎంత డబ్బు దొరికిందో తెలుసుకోవడానికి అధికారులు గంటల తరబడి లెక్కించడం గమనార్హం. డబ్బుతో పాటు, ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీగా బంగారం, వెండి, లగ్జరీ కార్లను సీజ్ చేసుకున్నారు. వీటి విలువ మరింత ఎక్కువగా ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఇంట్లో ఇంత మొత్తంలో నగదు, పత్రాలు లభ్యమవడం రాష్ట్రంలో కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..